ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదనే చెప్పాలి.. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు చేస్తూ ఎంతో మంది ఆడ పిల్లల జీవితాలను ఈ మానవ మృగాలు బలి తీసుకుంటున్నారు.. ఇక ఇప్పటికీ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే .. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా లో నలుగురు యువకులు ఓ యువతిపై […]
Tag: Telangana
స్కూల్ ఆయా నీచపు బుద్ధి.. 8 ఏళ్ల బాలుడితో అలా చేసిందట, చివరకు..?
మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడి చేయడం వంటి ఘటనలు ప్రతి రోజూ ఎన్నో చూస్తుంటాం. కానీ, హైదరాబాద్ నగరంలో సీన్ రివర్స్ అయింది. ఓ స్కూల్ ఆయా 8 ఏళ్ల బాలుడిపై లాంగిక దాడికి పాల్పడి నీచపు బుద్ధిని చూపించుకుంది. అయితే ఈ ఘటన 2017లో జరిగినప్పటికీ.. ఈ కేసులో నింధితురాలికి ఇప్పటికి శిక్ష పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బార్కాస్ ఏరియాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ 2017లో ఆయాగా […]
హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!
పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. […]
తెలంగాణలో విషాదం..నిండు ప్రాణాన్ని బలితీసుకున్న మిరపకాయ బజ్జీ..!
మృత్యువు ఎప్పుడు, ఏ క్షణాన, ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు మరియు ఊహించనూలేరు. తాజాగా ఓ వ్యక్తికి మిరపకాయ బజ్జీనే యమపాశమైంది. అవును, తాజాగా ఓ నిండుప్రాణాన్ని మిరపకాయ బజ్జీ బలితీసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల కారణంగా మంగళవారం సొంత గ్రామానికి వచ్చిన మల్లేశ్.. రాత్రి […]
భట్టి సరే.. మోత్కుపల్లి ఎందుకొచ్చినట్టు?
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన దళితబంధు సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ మీటింగుకు వచ్చిన వారంతా ఆ ఇద్దరు నాయకులను ప్రత్యేకంగా చూశారు. అరె.. వీరు కూడా వచ్చారా అన్నట్లున్నాయి వారి చూపులు. ఆ ఇద్దరూ ఎవరంటే.. ఒకరు మల్లు భట్టి విక్రమార్క, మరొకరు మోత్కుపల్లి నర్సింహులు. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో విస్తరించడంపై ఈ సమీక్ష నిర్వహించారు. మరో ఐదు మండలాల్లో (వేర్వేరు నియోజకవర్గాల్లో) అమలు చేయాలని సర్కారు […]
కేసీఆర్ కల ఇలా తీరుతుందేమో!
పరిశుభ్రమైన హుస్సేన్ సాగర్ ను హైదరాబాదు వాసులకు అందించాలనేది కేసీఆర్ కల. కానీ.. ఆ సాగర్ ఎప్పటికప్పుడు ఘోరంగా తయారైపోతుండడానికి ఉండే అనేక కారణాలలో వినాయక నిమజ్జనం కూడా ఒకటి. ఏటా వందలకొద్దీ వినాయక విగ్రహాలను ఈ హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేస్తుండడం.. దాని పరిశుభ్రతకు పెద్ద సవాలు. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన, ఇనుప కమ్మీలు వాడి తయారుచేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏ […]
కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!
ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]
గలాట.. గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదు
తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. ఆయన అవినీతికి హద్దు లేకుండా పోయింది.. రాష్ట్రాన్ని కల్వకుంట కుటుంబం దోచుకుంటోంది.. అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గొంతెత్తుతూ ఉంటాడు. రెండు వారాలుగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అవినీతి గురించే మాట్లాడతాడు. ప్రగతి భవన్ నుంచి జైలుకు పంపుతామని గట్టిగా చెబుతాడు. అయితే బండి సంజయ్ గట్టిగా చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని […]
డబ్బులు పడ్డాయ్ సరే.. డ్రా చేయడం ఎలా?
నాలుగైదు రోజులుగా తమ అకౌంట్లలో దళిత బంధు డబ్బు పడటంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే వారికి నిరాశే ఎదురవుతోంది. డబ్బు తీసుకునేందుకు అవకాశం లేకుండా అకౌంట్ ఫ్రీజ్ లో ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ కు గురికావడం వారి వంతైంది. డబ్బు వచ్చింది కదా అని డ్రా చేసుకునేందుకు లేదని.. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి దానిని వాడుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పథకం ప్రకటించిన ఇన్ని రోజుల […]