నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. అటు టిడిపి, ఇటు వైసీపీ నుంచి వారసులు రెడీగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం వైసీపీ నేతల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వారసులు పోటీ చేయడానికి లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలే మళ్ళీ తనతో పోటీ చేయాలని చెప్పారు. కానీ కొందరు సీనియర్ ఎమ్మెల్యేల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే […]
Tag: TDP
మంత్రివర్గంలో మార్పులు…ఆ నలుగురు అవుట్?
ఏపీలో మరోసారి మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్..పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టి వారి స్థానాల్లో కీలక నేతలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే రెండుసార్లు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని తప్పించి..చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]
నెల్లూరు ఎంపీ సీటుపై టీడీపీ పట్టు..వైసీపీ ఛాన్స్ ఇస్తుందా?
తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్ష మాదిరిగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నెల్లూరు పార్లమెంట్ కూడా ఒకటి..ఇక్కడ టిడిపి పెద్దగా విజయాలు సాధించలేదు. ఎప్పుడో 1984, 1989, 1999 ఎన్నికల్లో మాత్రమే అక్కడ టిడిపి గెలిచింది..మళ్ళీ ఆ తర్వాత గెలిచిన సందర్భాలు లేవు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో గెలుపు వరకు వచ్చి బోల్తా కొట్టింది. ఆ ఎన్నికల్లో కేవలం 13 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి ఓడిపోయింది. […]
ఎలమంచిలి సీటుపై ట్విస్ట్..జనసేన కోసం టీడీపీ!
ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున సీట్లలో ఎలమంచిలి కూడా ఒకటి..ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది..1985 నుంచి 1999 వరకు వరుసగా టిడిపి గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మళ్ళీ టిడిపి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో టిడిపి ఓడిపోయింది. వైసీపీ 4 వేల ఓట్ల మెజారిటీ తేడాతో గెలిచింది. అయితే జనసేన ఓట్లు చీల్చడం వల్లే అక్కడ టిడిపికి […]
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ మైండ్‌గేమ్!
టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ముమ్మాటికి నష్టమే..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిక ఉండదు..అదే కలిసి లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుని చెడగొట్టేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటికే దమ్ముంటే 175 స్థానాల్లో […]
టీడీపీకి 4..వైసీపీకి 5..జరిగేది ఏది?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయి..అసలు వైసీపీకి ఆ ఐదు సీట్లే వస్తాయి..అని చెప్పి అటు టిడిపి, ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు నాలుగు, ఐదు సీట్ల కథ ఏంటో ఒకసారి చూస్తే..గతంలో టిడిపి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టిడిపిలోకి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టిడిపికి అదే 23 సీట్లు వచ్చాయి. ఇదే దేవుడు స్క్రిప్ట్ అని వైసీపీ […]
బాబు దూకుడు..జగన్‌కు చెక్ సులువా?
మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత అనేక ఓటములు తర్వాత టిడిపికి సరైన విజయాలు దక్కాయి. ఇంతకాలం అధికార వైసీపీ ముందు టిడిపి తేలిపోతూ వచ్చింది..కానీ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టే విధంగా టిడిపి బలపడింది. అయితే ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు. తాజాగా మార్చి […]
అనంతలో లోకేష్ దూకుడు..పట్టు పెంచుతారా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఆయన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రకు ప్రజలు నుంచి స్పందన బాగా వస్తుంది. ఇక లోకేష్ సైతం దూకుడుగా ముందుకెళుతూ..వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా తనదైన శైలిలో లోకేష్ ముందుకెళుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు అనంతలో స్పందన బాగుంది. ఇక లోకేష్ దాదాపు అన్నీ నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర చేయనున్నారు. దీని వల్ల జిల్లాలో టిడిపి బలం మరింత […]
కోటంరెడ్డి ఎంట్రీ..నెల్లూరు రూరల్ సీటులో కన్ఫ్యూజన్..!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..టిడిపిలో చేరిపోయారు. అయితే ఎమ్మెల్యే పదవి ఉండటంతో కోటంరెడ్డి ఇంకా టిడిపిలో చేరలేదు..కానీ వైసీపీకి మాత్రం దూరం జరిగారు. ఎన్నికల ముందు ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక కోటంరెడ్డి ఎంట్రీ వల్ల నెల్లూరు రూరల్ టిడిపిలో ఏమైనా తలనొప్పులు వస్తాయా? అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఇంచార్జ్ గా అబ్దుల్ […]