ఫిరాయింపే బాబు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వికి అర్హ‌తా..!

టీడీపీలో మంత్రివ‌ర్గ విస్త‌`ర‌ణం` మొద‌లైంది. అనేక చ‌ర్చోప‌చ‌ర్చ‌లు, సుదీర్ఘ మంత‌నాలు, సామాజిక‌వ‌ర్గాల కూడిక‌లు, తీసివేత‌లు వీట‌న్నింటినీ లెక్క‌లోకి తీసుకుని చివ‌ర‌కు 11 మందితో కూడిన మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు. ఐదుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న పలికారు. వారి ప‌నితీరు, సామాజికవ‌ర్గం.. వీట‌న్నింటినీ అర్హ‌త‌లుగా ప‌రిగ‌ణించిన బాబు.. కొత్త మంత్రుల ఎంపిక‌లో `ఫిరాయింపుదారుల‌`కే అధికంగా ప‌ట్టం క‌ట్ట‌డాన్ని ఇప్పుడు పార్టీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ మార‌డ‌మే మంత్రి ప‌ద‌వికి అర్హ‌త అనేలా అధికంగా వారికే ఎక్కువ‌గా మంత్రి ప‌దవులు […]

కొడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై…కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

తెలంగాణ‌లో జిల్లాల‌ పున‌ర్విభ‌జ‌నతో కీల‌క నాయ‌కుల నియోజక‌వ‌ర్గాల్లో అనేక మార్పులు జ‌రిగిపోయాయి. త‌మ‌కు బ‌ల‌మైన, బాగా ప‌ట్టున్న ప్రాంతాలు వేరే జిల్లాకు వెళ్లిపోయాయి. దీంతో నాయ‌కులు కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు వెతుక్కుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో ఇప్పుడు నియోజకవర్గాల వెతుకులాట‌లో ప‌డ్డారు. ప్ర‌స్తుతం టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త నియోజ‌క‌వర్గం కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్ప‌టికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగ‌ల్ నుంచి పోటీచేసే అవకాశాలు త‌క్కువగా ఉన్నాయ‌ట‌. ముఖ్యంగా […]

నన్ను కించ పరిచిన పార్టీలో ఒక్క నిమిషమైన ఉండనంటున్న బోండా

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత.. ఏపీలో రాజ‌కీయాలు హీటెక్కాయి. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కని వారు ఇప్పుడు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అసంతృప్తి నాయ‌కులకు చెందిన క్యాడ‌ర్ తీవ్ర ఆగ్ర‌హ జ్వాల‌తో ఉంది. ముఖ్యంగా ప్ర‌తిపక్షంపై నిత్యం విరుచుకుప‌డే విజ‌యవాడ ఎమ్మెల్యే బోండా ఉమ‌.. త‌న‌కు మంత్రిప‌ద‌వి ద‌క్క‌కపోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ […]

ఉలిక్కి పడ్డ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఆశావాహుల మ‌ధ్య పెద్ద చిచ్చే పెట్టింది. మంత్రి ప‌ద‌వులు రాని ఆశావాహులు, సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి పోయిన సీనియ‌ర్ లీడ‌ర్ బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు సైతం తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ గౌతు […]

బాబు కేబినెట్‌లో క్యాస్ట్ ఈక్వేష‌న్ లెక్క త‌ప్పిందిగా…

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ సొంత పార్టీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. మొత్తం 26 ఖాళీలు పూర్తి కావ‌డంతో ఇక కొత్త‌గా ఎవ్వ‌రికి ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఈ విస్త‌ర‌ణ‌లో కులాల లెక్క త‌ప్పిన‌ట్టు రాజ‌కీయంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొన్ని సామాజిక‌వ‌ర్గాల‌కే పెద్ద పీఠ వేయ‌గా మ‌రి కొన్ని కీల‌క కులాల‌కు అస్స‌లు ప్రాధాన్య‌మే ల‌భించ‌లేదు. మైనార్టీలు, ఎస్టీలతో పాటు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి ఒక్క మంత్రికి కూడా చోటులేదు. దీంతో ఈ వ‌ర్గాల్లో […]

బాబుకు షాక్‌: జ‌గ‌న్ చెంతకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ కేబినెట్ ప్రక్షాళ‌న అధికార టీడీపీలో సెగ‌లు రేపుతోంది. మంత్రి ప‌ద‌వి రాద‌ని డిసైడ్ అయిన చాలా మంది సీనియ‌ర్లు బాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కొంద‌రైతే త‌మ‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోయినా ఓకే గాని..త‌మ శ‌త్రువుల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే పార్టీ వీడేందుకు కూడా సిద్ధ‌మే అని బాబుకు హెచ్చిరిక‌లు పంపుతున్నార‌ట‌. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తే తాను పార్టీలో ఉండ‌న‌ని రామ‌సుబ్బారెడ్డి ఇప్ప‌టికే బాబును క‌లిసి చెప్పేశార‌ట‌. ఈ […]

జ‌గ‌న్ కొంప ముంచుతున్న బాబు కోవ‌ర్టులు

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి రావడంతో ఆ పార్టీ నేత‌ల్లో గంద‌ర‌గోళం మొద‌లైంది. జ‌గ‌న్‌కు చెందిన ఒక చానెల్‌లో.. కేసుల‌కు సంబంధించిన వ్య‌క్తికి ఇంట‌ర్వ్యూ చేసిన స‌మ‌యంలో.. ఈ కేసుల గురించి ప్ర‌స్తావించ‌డంతోనే ఇదంతా జ‌రిగింద‌ని వారు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవ‌రు అడ‌గ‌మ‌న్నారు అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కోర్టు ప‌రిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడ‌ద‌ని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్న‌దెవ‌రు? జ‌గ‌న్ […]

ఏపీ కేబినెట్‌లో 5 గురు అవుట్ – 11 మంది ఇన్‌

యేడాదిన్న‌ర కాలంగా ఊరించి ఊరించి వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న కూర్పు ఎట్ట‌కేల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ముందు నుంచి అంద‌రూ ఊహిస్తున్న‌ట్టుగానే ఐదుగురు మంత్రుల‌కు చంద్ర‌బాబు ఉద్వాస‌న ప‌లికారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, చిత్తూరు జిల్లా నుంచి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్‌బాబు, అనంత‌పురం జిల్లా నుంచి ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డిని త‌ప్పించారు. ఇక కొత్త‌గా […]

బ్రాహ్మ‌ణి ఎంట్రీతో ఆ ఇద్ద‌రు ఎంపీల‌కు టెన్ష‌న్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మణి ఇద్ద‌రు ఎంపీల‌ను తెగ టెన్ష‌న్ పెడుతున్నారు. ఇటు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌తో చంద్ర‌బాబు..మంత్రుల‌ను టెన్ష‌న్ పెడుతుంటే.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల్లో గుబులు పుట్టిస్తున్నారు ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి! ముఖ్యంగా చంద్ర‌బాబు కుటుంబం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేసే వారి జాబితా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న త‌న‌యుడు.. ఎమ్మెల్సీగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. ఇప్పుడు ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే లీకులు ఇప్పుడు ఇద్ద‌రు ఎంపీలను […]