చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు `రిజ‌ర్వేష‌న్ల` అంశంలో త‌ల‌నొప్పులు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా ప‌రిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియ‌క సందిగ్థంలో ఉన్నారు. ఇప్ప‌టికే కాపు రిజర్వేష‌న్ల అంశంపై ఆందోళ‌న‌లు జరుగుతున్నా.. దానిని ఎలాగొలా అణిచివేస్తున్న చంద్ర‌బాబుకు.. ఇప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. మాల‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకుంటే మాదిగ‌లు దూర‌మైపోతారు.. అదే స‌మ‌యంలో మాదిగ‌ల‌ను దూరం చేసుకుంటే వాళ్లంతా ఇత‌ర […]

టీటీడీపీ నేత‌ల‌తో ఏపీలో పార్టీకి న‌ష్టం

రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయ‌కులు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీయ‌డంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్‌, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేత‌లు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ‌లో ఫిరాయింపుల‌పై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమ‌ర్శ‌లు వినిపిస్తున్న‌తరుణంలో.. టీటీడీపీ […]

ఎంపీపై మాజీ మంత్రి పీత‌ల శ‌ప‌థం

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ గ్రూపు రాజ‌కీయాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. కొద్ది రోజులుగా మాజీ మంత్రి పీత‌ల సుజాత వ‌ర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు మ‌ధ్య జ‌రుగుతోన్న పోరు ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇక పీత‌ల సుజాత ప్రాధినిత్యం వ‌హిస్తోన్న చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్తీ కాలేదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది. జిల్లాలోని అన్ని ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వులు […]

మ‌రీ ఇంత అత్యుత్సాహ‌మేంటి జ‌గ‌న్‌!

ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ మ‌రోసారి అత్యుత్సాహం ప్ర‌దర్శించారు. ప్ర‌ధాని మోడీని ఢిల్లీలో క‌లిసిన నాటి నుంచి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిపై విమర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ప‌ట్టించుకోకుండా తాను ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటూ ఆయ‌న మొండిగా ముందుకు వెళుతున్నారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన నాటి నుంచి ఇది మ‌రింత ఎక్క‌వైంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఎన్డీఏ అభ్య‌ర్థి రామ‌నాథ్ కోవింద్‌ను జ‌గ‌న్ ఏపీలో కాకుండా తెలంగాణ‌లో క‌ల‌వ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. […]

పవన్ సర్వే ఏ పార్టీకి?

2019 ఏపీలో ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అనే థీమ్‌తో ఇటీవ‌ల ఆయ‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల స‌ర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక‌, ప్ర‌శ్నిస్తానంటూ […]

నంద్యాల ఓట‌ర్ల‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు

నంద్యాల‌లో ప‌సుపు జెండా రెప‌రెప‌లాడించేందుకు స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. ఇది త‌మ నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని, నాయ‌కులు వెళ్లినా క్యాడ‌ర్ మాత్రం త‌మ వైపే ఉంద‌ని.. ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. త‌మ అభ్య‌ర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బ‌లంగా ఉన్న శిల్పామోహ‌న రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో చంద్ర‌బాబు అల‌ర్ట్ అయ్యారు. కేవ‌లం సెంటిమెంట్‌ను న‌మ్ముకునే బ‌రిలోకి దిగుతున్నామ‌న్న అప‌వాదు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా ఉండేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిల‌లు ప్ర‌క‌టిస్తున్నారు. నిధులు, […]

ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గ‌మ్మే సాక్ష్యం

మిత్రప‌క్షాల మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. రాజ‌ధాని ప్రాంతం, ఏపీకి కీల‌కమైన విజ‌య‌వాడ‌లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది. 2014 ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ దుర్గ‌మ్మ స‌న్నిధిలో జ‌రిగిన సంఘ‌ట‌న మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వ‌యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండ‌ల మాణిక్యాల రావు… క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణాస్వీకారానికి గైర్హాజ‌రవ‌డం […]

టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం చాలా హాట్‌హాట్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో ఫైరైయ్యారు. సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో కొందరు మంత్రులపై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల బాబు ప‌నితీరుపై జాతీయ స్థాయి సంస్థ చేసిన స‌ర్వేలో 47 శాతం మంది సంతృప్తిగా ఉన్న‌ట్టు ఫ‌లితాలు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. దీనిపై బాబు మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌నితీరుపై సంతృప్తి శాతాన్ని 47 శాతం నుంచి […]

టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?

తెలంగాణ‌లో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వ‌చ్చిన వార్త‌లు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. త‌ర్వాత ఇది సాధ్య‌ప‌డేదే కాదంటూ కొంద‌రు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్యే ఈ చ‌ర్చ రావ‌డంతో ఎప్పుడు ప‌రిస్థితులు ఎలా మార‌తాయోన‌ని విశ్లేష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి సంగ‌తేంటి? అనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. కేసీఆర్‌-రేవంత్ ఒకే ఒర‌లో ఇమ‌డని రెండు క‌త్తులన్న విష‌యం […]