చిన్నమ్మ కోటరీకి బీటలు! విద్యా మంత్రి పన్నీర్ గూటికి జంప్!

త‌మిళ‌నాట రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్నటి వ‌ర‌కు తిరుగులేద‌ని అనుకున్న చిన్న‌మ్మ‌.. ఆశ‌లు ఒక్క‌సారిగా ఆవిర‌వుతున్నాయి. ప‌న్నీర్ సెల్వాన్ని విజ‌య‌వంతంగా సీఎం సీటు నుంచి రాజీనామా చేయించిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇంత‌లో క‌థ అడ్డం తిరిగింది. ప‌న్నీర్ తిరుగుబావుటా ఎగురేశారు. దీనికి వెనుక ఎవ‌రున్నారు?  ముందు ఎవ‌రున్నారు? అనే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్న త‌రుణంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా […]

శశికళకు సోషల్ మీడియాలో చుక్కెదురు

ఒక‌ప‌క్క అన్నాడీఎంకే కార్య‌ద‌ర్శి, జ‌యల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు త‌గ్గిపోతూ ఉన్న వేళ‌.. జ‌య న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వానికి అంత‌కంత‌కూ మ‌ద్ద‌తు పెరుగుతున్న వేళ‌.. సోష‌ల్ మీడియాలో త‌మిళ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌న్నీర్ సెల్వం వేసే ఎత్తుల‌తో శ‌శిక‌ళ వ‌ర్గం ఢీలా ప‌డిపోతోంది. సీఎం పీఠం కోసం జ‌రుగుతున్న పోరులో.. ప‌న్నీర్‌కు ప్ర‌జల మ‌ద్ద‌తుతో పాటు.. నెటిజ‌న్ల మ‌ద్ద‌తు కూడా పెరుగుతోంది. సీఎం అభ్య‌ర్థి ప‌న్నీర్ సెల్వ‌మా లేక శ‌శిక‌ళ‌నా అని నిర్వ‌హించిన స‌ర్వేలో […]

జ‌య వార‌సుడి అడ్ర‌స్ ఎక్క‌డ‌..!

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత‌ వార‌సులు ఎవ‌రు? జయ నెచ్చెలి శ‌శిక‌ళ‌నా లేక జ‌య న‌మ్మిన‌బంటు పన్నీర్ సెల్వమా? అనే విష‌యంపై ఇప్ప‌టికీ స‌స్పెస్ కొన‌సాగుతోంది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె వార‌సుడిగా త‌మిళ‌ సినీన‌టుడు అజిత్ పేరు బాగా వినిపించింది. కానీ త‌ర్వాత ఆ పేరు వినిపించ‌నేలేదు! అయితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాట రాజ‌కీయ సంక్షోభం ఉన్నా.. అజిత్ ఎందుకు నోరుమెద‌ప‌డం లేదు? అస‌లు అజిత్ ఏమ‌య్యాడు ? సినీ తార‌లు ప‌న్నీర్ సెల్వానికి […]

పన్నీర్ యాక్షన్.. శశికళ లెక్కలు తారుమారు!

త‌మిళ‌నాడులో సీఎం సీటు కోసం జ‌రుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు రోజుల కింద‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా అంతా జ‌రిగిపోతుంద‌ని అనుకున్న పరిస్థితిలో ప‌న్నీర్ పేల్చిన బాంబు రాష్ట్ర అధికారం ప‌క్షంలో మ‌రో వ‌ర్దా తుఫానును సృష్టించింది. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలున్న  అధికార అన్నాడీఎంకేలో అధికారం చేప‌ట్టాల‌నుకునే వారు క‌నీసం 117 మంది ఎమ్మెల్యేల మెజారిటీని పొంది ఉండాలి. ఈ నేప‌థ్యంలో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తాను గీసిన గీత దాట‌ర‌ని చెప్పిన శ‌శిక‌ళ‌.. […]

పన్నీర్ వెంట టీడీపీ.. శశికళ వెంట వైకాపా!

త‌మిళ‌నాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జ‌రుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆక‌ర్షించింది. పురుట్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన త‌మిళ‌నాడు సీఎం సీటును ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా అమ్మ‌కు అత్యంత విధేయుడు, ఆద‌ర్శ‌ప్రాయుడు అయిన ప‌న్నీర్ సెల్వం త‌మిళ‌నాడుసీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే, ఈ సీటుపై క‌న్నేసిన శ‌శిక‌ళ‌.. ప‌న్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు త‌న‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించుకున్నారు. […]

జయకు శశికళకు మధ్య తోపులాట … అసలు ఏమి జరిగింది ?

త‌మిళనాట రాజకీయాలు ఊహించ‌ని మ‌లుపుల‌తో థిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తున్నాయి! అధికారం కోసం జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో.. ఎన్నో ట్విస్ట్‌లు న‌మోద‌వుతున్నాయి! ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలతో జ‌య నెచ్చెలి శ‌శిక‌ళపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీవ్ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ‌పై అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య ఆసుప‌త్రిలో చేరిన రోజు రాత్రి ఏమ‌యిందో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు! సెప్టెంబ‌రు 22న పోయెస్ గార్డెన్‌లో శశిక‌ళ‌కు, జ‌య‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింద‌ని, అందులోనే జ‌య‌ను శ‌శిక‌ళ తోసేయ‌డంతోనే ఆమె […]

చిన్నమ్మ జాతకాన్నిమార్చలేని జ్యోతిష్కులు

త‌మిళ‌నాట రాజ‌కీయ సింహాస‌నంపై కూర్చోవాల‌ని దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ త‌హ‌త‌హ‌లాడుతున్నారు! అప్పుడో ఎప్పుడో సీఎం అవుతార‌ని అన్నాడీఎంకే కార్య‌కర్త‌ల‌తో పాటు.. ప్ర‌జ‌లు కూడా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆగ‌మేఘాల మీద చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సీఎం పీఠం ఎక్కేందుకు శ‌శిక‌ళ ఎందుకు ఇంత తొంద‌ర‌ప‌డుతున్నారు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అంద‌రినీ తొలుస్తోంది! అయితే దీనికి  మ‌న్నార్ గుడి జ్యోతిషుల ప్రభావం అధికంగా ఉంద‌ని సమాచారం! రాజ‌కీయ నాయ‌కుల‌కు […]

శ‌శిక‌ళ‌కు ముందుంది ముస‌ళ్ల పండ‌గ

త‌మిళ‌నాట రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. పార్టీప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇక రేపో మాపో సీఎం పీఠంపై కూర్చోవాల‌ని చూస్తున్న శ‌శిక‌ళ‌కు.. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తే `అధికార […]

త‌మిళ సీఎం దీపానే…! శ‌శిక‌ళ‌కు షాకే

`అమ్మ‌`ను కోల్పోయిన త‌మిళ‌వాసుల‌కు స‌రికొత్త ఆశా`దీపం` దొరికింది. త‌మిళ రాజ‌కీయాల‌ను శాశించాల‌ని కోరుకుంటున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు దీప రూపంలో ఊహించ‌ని షాక్ ఎదురైంది. జ‌య అన్న కూతురు దీపకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెపై రోజురోజుకూ ఒత్తిడి అధిక‌మ‌వుతోంది. చెన్నై టీనగర్‌లోని ఆమె ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వ‌చ్చి.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెను బ‌తిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన `చిన్న‌మ్మ‌` […]