మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `రంగస్థలం`. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. భారీ అంచనాల నడుము 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే […]
Tag: Latest news
ఏపీలో కరోనా విలయతాండవం..11వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 11 వేలకు చేరువలో నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
`విస్కీ` అంటే పిచ్చ ఇష్టమంటున్న అనుపమ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ కేరళ ముద్దుగుమ్మకు విస్కీ అంటే పిచ్చ ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే విస్కీ అంటే తాగేది కాదండోయ్.. అనుపమ పెంచుకునే కుక్క. తను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల విస్కీ నాలుగో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా విస్కీతో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకుంది. […]
కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!
ప్రస్తుతం ప్రాణాంతక వైరస్ అయిన కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలందరూ తమ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ న్యాచురల్ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ […]
అనుకున్నట్టుగానే రజనీకి షాకిచ్చిన బాలయ్య..ఖుషీలో ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌తో బాలకృష్ణ అగ్ర […]
ప్రభాస్ అలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు..శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇటీవల జరిగిన షెడ్యూల్లో ప్రభాస్, శ్రుతి హాసన్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి శ్రుతి […]
లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్!
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచాయలు అవసరం లేదు. `ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా` అంటూ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిందులేసి తెలుగు ప్రేక్షకులగా బాగా దగ్గరైంది ఈ చిన్నది. ఆ తర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం ఇలా పలు చిత్రాల్లో నటించింది. అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకత్వంలో మమతా […]
మొన్న పవన్, ఇప్పుడు మహేష్..లక్ అంటే ఇస్మార్ట్ పోరిదే?
నిధి అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న `హర హర వీర మల్లు` చిత్రంలో నిధి ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఛాన్స్ వరించినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి […]
దేశంలో కొత్తగా 2,624 మంది కరోనాకు బలి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,46,786 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481 కు చేరుకుంది. అలాగే నిన్న 2,624 మంది […]









