`సైమా`లో బ‌న్నీ మూవీ హ‌వా..ఎన్ని అవార్డులు వ‌చ్చాయో తెలుసా?

సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడ‌క‌ నిన్న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తార‌లు ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` హ‌వా చూపించింది. ఇప్ప‌టికే ఎన్నెన్నో రికార్డులు నెల‌కొల్పిన ఈ చిత్రం సైమాలో ఒక‌టి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ప‌ది […]

వైర‌ల్ పిక్స్‌: రెచ్చిపోతున్న శ్రీ‌ముఖి..టాప్ షోతో కాక‌పుట్టిస్తోందిగా!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాలు చేసింది. అలాగే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ ముద్ద‌గుమ్మ టీవీ షోలు, సినిమాలు మ‌రియు అవార్డు ఫంక్ష‌న్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో తెగ […]

అర‌రే..నానికి పెద్ద చిక్కే వ‌చ్చిందిగా..ఫ్యాన్స్ ఆందోళ‌న‌?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి టాలీవుడ్ టాప్ హీరో వ‌ర‌కు ఎదిగిన న్యాచుర‌ల్ స్టార్ నానికి ఇప్పుడు ఓ పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. గ‌త కొంత కాలం నుంచి ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మ‌ధ్య ఓటీటీలో భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన‌ వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లిన‌ప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చినా.. […]

వైభ‌వంగా యాంక‌ర్ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచీ అంద‌రితోనూ స‌ర‌దాగా ఉంటూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడీయ‌న‌. అయితే నిన్న(సెప్టెంబ‌ర్ 19) ర‌వి బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ […]

సాయి ప‌ల్ల‌విని ఏకిపారేసిన చిరంజీవి.. కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన సాయి ప‌ల్ల‌విని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అంద‌రి ముందు ఏకేశారు. ఇందుకు కార‌ణం ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేయ‌డ‌మే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొద‌టి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా.. ఆమె రిజెక్ట్ చేసింద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే […]

ఏపీలో కొత్త‌గా 1,337 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,337 […]

స్టూడెంట్‌ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్.. తిక్క కుదిర్చిన గ్రామస్థులు?!

స్త్రీల‌నే కాదు చిన్న చిన్న పిల్ల‌ల‌ను కూడా కొంద‌రు మ‌గ మృగాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా ఈ హెడ్ మాస్ట‌ర్ త‌న నీచ‌పు బుద్ధిని చూపించుకున్నాడు. 12 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులకు పాల్ప‌డి.. ఆమె బుగ్గ‌ను కొరికేశాడు. ఈ ఘ‌ట‌న బీహార్ లోని చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్న 12 ఏళ్ల బాలిక‌ను అక్క‌డే ప‌ని చేస్తున్న […]

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన బాలాపూర్ ల‌డ్డూ..ఎంత పలికిందంటే?

తెలంగాణ‌లో బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని న‌మ్ముతారు. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో పాల్గొని.. ల‌డ్డూను ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇక ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా బాలీపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర‌కు అమ్ముడైంది. ఈ రోజు ఉద‌యమే బాలాపూర్ గణేశుడు ఊరేగింపుగా బయలుదేరాడు. గ్రామ వీధుల గుండా శోభాయాత్ర కొనసాగించిన అనంతరం బాలాపూర్‌లోని బొడ్రాయి […]

భార‌త్‌లో కొత్త‌గా 30,773 క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త […]