వైభ‌వంగా యాంక‌ర్ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

September 20, 2021 at 8:16 am

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచీ అంద‌రితోనూ స‌ర‌దాగా ఉంటూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడీయ‌న‌.

Anchor Ravi Birthday Celebrations | Nitya Saxena | Viya | #BiggBossTelugu5  | #HappyBDayRavi - YouTube

అయితే నిన్న(సెప్టెంబ‌ర్ 19) ర‌వి బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Atlast Anchor Ravi Reveals His Wife And Kid To World | Galli 2 Delhi Telugu  News

ఈ క్ర‌మంలోనే రవి కూతురు వియా కేక్‌ కట్‌ చేసి తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, బిగ్ బాస్ హౌస్‌లోనూ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

వైభ‌వంగా యాంక‌ర్ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు..నెట్టింట వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts