మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]

టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?

రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]

చీరాలలో కొత్త ట్విస్ట్..?

2014 ఎన్నికల నుంచి చీరాల నియోజకవర్గంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అసలు ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో..ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్…2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వ్యక్తిగత ఇమేజ్ తోనే ఆమంచి గెలిచారు. అప్పుడు టీడీపీ నుంచి పోతుల సునీత పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో…ఆమంచి టీడీపీలోకి వచ్చారు. దీంతో […]

రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్!

మొదట నుంచి రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి అంత కలిసిరాదనే చెప్పాలి…ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్..ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ స్థానాలు, 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగింది. కేవలం టీడీపీ ఒకటి, జనసేన ఒక ఎస్సీ స్థానాన్ని మాత్రం గెలుచుకున్నాయి. మిగిలిన సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. ఇప్పుడుప్పుడే టీడీపీ పుంజుకుంటుంది. […]

కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]

అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు. అయితే అంబటి […]

గంటా సీటు జనసేనకే ఫిక్స్?

అవసరానికి తగ్గట్టు రాజకీయం చేయడంలో గంటా శ్రీనివాసరావుని మించిన వారు లేరనే చెప్పాలి..తనకు ఎప్పుడు విజయాలు దక్కేలాగానే గంటా రాజకీయం నడుపుతుంటారు. అలాగే ఏమైనా రాజకీయంగా ఇబ్బందులు ఉంటే..సైలెంట్ గా ఉండటంలో గంటాని మించిన వారు లేరు. అయితే ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారిన, నియోజకవర్గాలు మార్చిన సరే..ఆయనకు విజయాలు దక్కాయి. కానీ ఈ సారి గంటా పరిస్తితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది…ఈ సారి ఆయన ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి పోటీ […]

పవన్ ప్రత్యర్ధికి సీటు డౌటేనా?

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించి…తిప్పల నాగిరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే…గాజువాక బరిలో తిప్పల నాగిరెడ్డి మంచి విజయమే అందుకున్నారు. వాస్తవానికి గాజువాక వైసీపీకి  పెద్దగా అనుకూలమైన నియోజకవర్గం కాదు…2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన గాజువాకలో…మొదట ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా పవన్ పోటీ చేయడంతో ముక్కోణపు పోటీ నడిచింది…వైసీపీ-టీడీపీ-జనసేనల మధ్య పోటీ జరిగింది. కానీ ఇక్కడ వైసీపీ గెలవడానికి ఒకే ఒక కారణం…టీడీపీ-జనసేనల […]

జంపింగ్: బాలినేనిపైనే డౌటా?

ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కొందరు నేతలు…గెలిచే పార్టీని ముందే ఊహించి జంపిగులు చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇలాంటి జంపింగులు సర్వసాధారణమే. గెలుపు ఊపు ఉన్న పార్టీలోకి నేతలు ఎక్కువ వెళ్తారు…అలాగే ఒక పార్టీలో టికెట్ దక్కకపోతే మరొక పార్టీలోకి వెళ్తారు. ఇలా రాజకీయ జంపింగులు మామూలుగానే జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జంపింగులు మళ్ళీ మొదలయ్యేలా ఉన్నాయి..కాకపోతే ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందో అంచనా వేయలేని పరిస్తితి. అటు […]