కాంగ్రెస్‌కు కేసీఆర్ రివర్స్ స్కెచ్..జంపింగులు షురూ.!

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఊహించని మైలేజ్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇలా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ సైలెంట్ గా ఉండరు కదా..కాంగ్రెస్ కు చెక్ పెట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ని చావు […]

జంపింగులకు సీటు ఫిక్స్..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం చేపట్టాలని కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కే‌సి‌ఆర్ పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అయితే ముందే ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే అభ్యర్ధులని ఖరారు చేశారని, ఆగష్టులో మొదట లిస్ట్ విడుదల చేశారని తెలిసింది. అధిక […]

బీసీలపై కాంగ్రెస్ గురి..ఆ సీట్లు ఫిక్స్.!

తెలంగాణలో కూడా కులాల వారీగా రాజకీయం నడుస్తుంది. ఎక్కడకక్క కులాల ఓట్లని ఆకర్షించడమే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. ఇప్పటికే దళితబంధు అని దళితులని, ఇటు బీసీల లక్ష సాయం అంటూ..బి‌సిలని..అటు మైనారిటీలకు సాయం అంటూ వారిని..ఇలా అందరినీ ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా రాజకీయం చేస్తుంది. వారు కూడా బలమైన బీసీలని ఆకట్టుకోవడానికి వారికి ప్రతి పార్లమెంట్ లో రెండు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. మొత్తంగా […]

కాంగ్రెస్‌లోకి షర్మిల ఫిక్స్..ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా?

మొత్తానికి వైఎస్ షర్మిల…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తేలిపోయింది. అతి త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తెలుస్తుంది. ఇటీవల ఆమె చేస్తున్న రాజకీయం..అలాగే కాంగ్రెస్ లో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే..షర్మిల ఇంకా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇటీవలే కే‌వి‌పి రామచంద్రారావు..విలీనంపై చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమని చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సైతం..విలీనం అంశం ఏ‌ఐ‌సి‌సి చూసుకుంటుందని అన్నారు. […]

కమలం మళ్ళీ రేసులోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్.!

తెలంగాణలో గత కొంతకాలం నుంచి బి‌జే‌పి సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కీలక మార్పులు..అధ్యక్షుడుని మార్చడంతో కొంత అనిశ్చితి పరిస్తితులు నెలకొన్నాయి. అలాగే అనూహ్యంగా ఆ పార్టీ రేసులో వెనుకబడింది. ఇటు కాంగ్రెస్ ముందుకొచ్చింది. అయితే అంతకముందు బి‌జే‌పి పైకి లేవడానికి కే‌సి‌ఆర్ చేసిన రాజకీయమే కారణమని, అలా బి‌జే‌పిని పైకి లేపితే కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలుస్తుందని దాని ద్వారా బి‌ఆర్‌ఎస్ కు లాభమని విశ్లేషణలు వచ్చాయి. […]

సబితాకు తీగల చెక్..కేసీఆర్‌కు షాక్..కాంగ్రెస్‌లోకి జంప్!

వలసలని అధికంగా ప్రోత్సహించడం కూడా అనర్ధమే అని తెలంగాణలో అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని చూస్తే అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన…ప్రతిపక్షాలు ఉండకూడదనే కాన్సెప్ట్ లో కాంగ్రెస్, టి‌డి‌పిలోని ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. ఇలా లాగడం వల్ల బి‌ఆర్‌ఎస్‌కు ఒరిగింది ఏమి లేదు. అదనంగా ఆధిపత్య పోరు వచ్చింది. అసలు బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరుకు వలస నేతలే కారణం అవుతున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీటు దక్కదనే […]

ఎన్డీయే వర్సెస్ ఇండియా..ఆట మొదలు.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయమే కాదు..ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. నెక్స్ట్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడానికి ఇప్పటినుంచే అధికార, విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే మూడోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని మోదీ నేతృత్వంలోని బి‌జే‌పి చూస్తుంది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి గెలుపు అనేది సులువు కాదు. బి‌జే‌పి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది కాస్త కష్టం. అందుకే బి‌జే‌పి..తమ పాత, కొత్త మిత్రపక్షాలతో సమావేశం […]

ఉచిత విద్యుత్‌ని కవర్ చేసిన కారు..కాంగ్రెస్ సక్సెస్.!

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ముఖ్యంగా కే‌టి‌ఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు యుద్ధం నడుస్తుంది. అయితే అమెరికాలో ఉండగా రేవంత్..3 ఎకరాలు నీరు పెట్టడానికి 3 గంటలు సరిపోతుందని, సరాసరినా రోజుకు 8 గంటల చాలు అని అన్నారు. 24 గంటల కరెంట్ వద్దని చెప్పలేదు. కానీ అదిగో […]

కేటీఆర్ వర్సెస్ రేవంత్..ప్రజలు ఎటువైపు.!

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత  అని చెప్పి కనీసం 12 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటుంది. ఈ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్లుకు వెళ్ళి..24 గంటలు రావడం లేదని రుజువు చేశారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, మొత్తం మీద 8 గంటలు […]