ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది. ఇదే సమయంలో గన్నవరం సీటు విషయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. గత ఎన్నికల్లో వంశీ టిడిపి నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ చేశారు. వెయ్యి ఓట్ల మెజారిటీతో వంశీ గెలిచారు. తర్వాత వంశీ టిడిపిని వదిలి వైసీపీలోకి వచ్చారు. అక్కడ నుంచి […]
Category: Politics
శ్రీదేవి భజన..బాబు సీటు ఇస్తారా?
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు భజన చేసే నేతలకు కొదవ ఉండదనే చెప్పాలి. అలాంటి భజన చేయడంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తిరుగులేదనే చెప్పాలి. మొన్నటివరకు వైసీపీలో ఉన్న ఈమె..జగన్‌కు ఏ స్థాయిలో భజన చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్య శ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గుండె..జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా భజన చేశారు. అయితే ఈమె ఎమ్మెల్యేగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాడికొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో […]
రిషికొండ వివాదం..విశాఖ జనమే తేల్చేస్తారా?
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో రిషికొండ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసినే. వైసీపీ ప్రభుత్వం..పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విశాఖలోని రిషికొండని తవ్వేసి..అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు సిఎం జగన్ నివాసం ఉండటానికి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ప్రకృతిని నాశనం చేసి ఇలా అక్రమ కట్టడాలు కట్ట కూడదని ఫైర్ అవుతున్నాయి. ఇప్పటికే రిషికొండపై అటు చంద్రబాబు, ఇటు పవన్ ఫైర్ […]
జగనే టార్గెట్.. గాజువాకపై నో క్లారిటీ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ నగరంలో సభ నిర్వహించిన పవన్..ఆ తర్వాత రిషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని పరిశీలించడానికి వెళ్లారు. అలాగే విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్రమంగా భూ కబ్జాలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తాజాగా ఆయన గాజువాకలో పర్యటించారు. గాజువాక సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. ఇక ఆద్యంతం జగన్‌నే టార్గెట్ […]
ఇలా అయితే అనుకున్న లక్ష్యం కష్టమే…!
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం.. అనుకున్న లక్ష్యం చేరడం కష్టంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం… అధ్యక్షుని మార్పు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన బీజేపీ నేతలు.. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిందనే చెప్పాలి. కేవలం ఒకటే […]
రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?
రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా […]
లోకేశ్ పాదయాత్రలో ఫ్లెక్సీల కలకలం…!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమతో పాటు ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకున్నయాత్ర… రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన ఇప్పటికే 2,400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది కూడా. దీంతో ప్రతి […]
టీడీపీ నేతల్లో అతివిశ్వాసం….. కారణం అదేనా…!
రాబోయే ఎన్నికలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాములాంటివనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలు, అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటివి ఇప్పటి నుంచే చేసేస్తున్నారు. క్యాడర్‌కు కూడా పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో ఇప్పటి నుంచే చెబుతున్నారు చంద్రబాబు. అయితే అధినేత తీరుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో […]
టీ.కాంగ్రెస్‌పై డీకే ఫోకస్..కేసీఆర్‌కు ధీటుగా.!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధిష్టానం గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటి అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ ముఖ్యం..అందుకే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయం సాధించడం కూడా అంతే ముఖ్యమన్నట్లు పనిచేస్తుంది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. సెమీ ఫైనల్స్ మాదిరిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇదే […]