తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. […]
Category: Politics
టార్గెట్ తెలంగాణ… బీజేపీ మాస్టర్ ప్లాన్…!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మొత్తం 119 […]
ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్న ఎమ్మెల్సీలు….!
బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ […]
శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఫుల్ క్లారిటీ…!
రాబోయే ఎన్నికల్లో గెలుపే వైసీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికే పార్టీ నేతలకు వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉన్నది శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం. వరుసగా రెండు సార్లు ఓడిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి […]
నగరిలో జగన్..రోజాకు హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తారా?
సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడం,, అభివృద్ధి పనులు ప్రారంభించడం పేరుతో సిఎం జగన్..గత కొన్ని రోజులుగా ఏదొక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఆయా స్థానాల్లో వైసీపీ బలం పెరిగేలా జగన్ సభలు జరుగుతున్నాయి. ఓ వైపు పథకాలకు బటన్ నొక్కడం, మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడుతున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 28న నగరి నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కనున్నారు. […]
సీట్లు ఫైనల్..ఈ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నో.!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి సత్తా చాటాలని చూస్తున్న కేసిఆర్.. తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మొదట లిస్ట్ విడుదల చేయడంపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇక దాదాపు అభ్యర్ధులని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. సుమారు ఓ 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం మాత్రం లేదని సమాచారం. వారికి ఆల్రెడీ కేసిఆర్..పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కేటిఆర్, హరీష్ ద్వారా..వారిని బుజ్జగించే ప్రయత్నాలు […]
బాబు పాలన బెటర్..పవన్‌కు 2019 సీన్ రిపీట్ కావాలా?
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ తక్షణమే అధికారంలో నుంచి దిగిపోవాలి..వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..టిడిపితో కలిసి పొత్తులో పోటీ చేస్తాం..బిజేపి కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జగన్‌ని గద్దె దించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంటే టిడిపితో కలిసి వెళ్లడానికి పవన్ రెడీ అయ్యారు. అది కూడా జగన్ ని ఓడించడం కోసమే. అయితే జగన్ మంచి పాలన అందిస్తే..ఇవన్నీ ఉండేవి కాదని, తానే మద్ధతు ఇచ్చేవాడినని, జగన్ […]
గన్నవరం పోరు షురూ..వంశీ వర్సెస్ యార్లగడ్డ.!
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడించాలనే కసితో ఉన్నది కేవలం ముగ్గురుపైనే..అందులో మొదట సిఎం జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలనేది ప్రథమ లక్ష్యం..ఇక తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించాలని కసితో ఉన్నారు. వీరిద్దరిపైనే టిడిపి శ్రేణులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చంద్రబాబు, లోకేష్‌లని ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. పైగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిడతారు. అందుకే ఎలాగైనా వీరిని ఓడించాలని టిడిపి శ్రేణులు […]
ఆ ఇద్దరి మధ్య… పొత్తు ఉన్నట్లా… లేనట్లా…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పుకార్లతో పాటు అధికార వైసీపీ నేతలు సైతం అభ్యర్థుల ప్రకటన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తుండటంతో… ముందస్తు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే […]