అమలాపురం సీటుపై ట్విస్ట్..వైసీపీ-టీడీపీల్లో కన్ఫ్యూజన్.!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా సి‌ఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి బటన్ నోక్కారు. ఇదే సమయంలో కోనసీమలో రాజకీయంగా వైసీపీ పట్టు తగ్గకుండా ఉండేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే అమలాపురం అసెంబ్లీలో మంత్రి పినిపే విశ్వరూప్ సీటు విషయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో విశ్వరూప్, […]

టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్‌కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టి‌డి‌పి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, […]

విశాఖపైనే పవన్ గురి.. వైసీపీకి రిస్క్ పెంచుతారా?

పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్రని విశాఖలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విశాఖ జగదాంబ సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. తర్వాత రిషికొండకు వెళ్ళి..అక్కడ సి‌ఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణాలని పరిశీలించారు. ఇక వరుసగా విశాఖలో పవన్ పర్యటించనున్నారు. రోడ్ షోలు, భారీ సభలు ఏర్పాటు చేయనున్నారు. టోటల్ గా విశాఖపైనే పవన్ గురి పెట్టారు. దసరాకు జగన్ విశాఖ నుంచే పాలన మొదలుపెడుతున్న నేపథ్యంలో పవన్..విశాఖలో పర్యటించడం చర్చనీయాంశమైంది. అక్కడ వైసీపీకి చెక్ […]

రాజద్రోహం చట్టానికి కేంద్రం చెల్లుచీటీ… ఇకపై దేశ ద్రోహ చట్టం…!

రాజద్రోహం చట్టానికి కేంద్ర ప్రభుత్వం చెల్లుచీటీ పాడింది. నేర న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. మూక దాడులకు మరణశిక్ష తప్పదని హెచ్చరించింది. కోర్టులో వాదనలు పూర్తయిన నెల రోజుల్లో తీర్పు చెప్పాలని సూచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరిరోజున ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. 17 రోజుల్లో 44 గంటలకుపైగా లోక్‌సభా కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా వెల్లడించారు. మరో పక్క అవిశ్వాస తీర్మానంపై మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో […]

రాముడు… రాముడే… రామూ నోటీ నుంచి సూక్తి ముక్తావళి..!

అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్‌ గోపాల్‌ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ […]

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే పట్టించుకోకపోతే ఎలా…!?

ఓటర్ల జాబితాలో అవకతవకలపై రోడ్డెక్కిన టీడీపీ.. అవకాశం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది. మొదటి నాలుగు రోజులు ఇంటింటి తనిఖీలు అంటూ హడావుడి చేసిన క్యాడర్‌.. ప్రస్తుతం అటువైపు కూడా వెళ్లడం లేదు. ఇంచార్జ్‌ల అలసత్వమే అందుకు కారణమవుతోందనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం సాగుతోంది. బూత్ లెవల్ ఏజెంట్‌లతో టీడీపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదు. ఓటర్ల జాబితా పరిశీలపై ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ […]

వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు…!

ఓ వైపు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు జగన్. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రివ్యూ సమావేశంలో నేతలకు పలు సూచనలు కూడా చేశారు. 9 నెలలు కష్టపడితే… పార్టీకి, మీకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని నియోజకవర్గాలు పార్టీని ఇబ్బంది […]

పాతపట్నం సీటు ఎవరికి? సీనియర్ వర్సెస్ జూనియర్.!

తెలుగుదేశం పార్టీ వేగంగా పుంజుకుంటున్న సీట్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం కూడా ఒకటి. ఇటీవల సర్వేల్లో ఇక్కడ టి‌డి‌పికి ఆధిక్యం ఉందని తేల్చి చెప్పాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వరుసగా వైసీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా అతి త్వరగా ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అటు తన వారసుడు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అటు వంశధార నిర్వాసితులకు న్యాయం జరగలేదు. అభివృద్ధి […]

సీటు రాకపోతే ఇండిపెండెంట్..టీడీపీ-జనసేనలో కొత్త రచ్చ.!

టీడీపీ-జనసేన పొత్తు కొత్త సమస్యకు దారి తీసేలా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు కానీ..కింది స్థాయిలో రెండు పార్టీల శ్రేణులు ఎంతవరకు కలుస్తాయి. ఎంతవరకు సహకరించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఒక పార్టీకి సీటు దక్కితే మరొక పార్టీ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కూడా […]