చంద్రబాబు అరెస్ట్‌… టీడీపీ అనుకూలించలేదా…?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు క్రమంగా మరుగున పడుతున్నట్లుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో భారీ స్కామ్‌ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో… 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో… సుప్రీం కోర్టు గడప తొక్కారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అదే సమయంలో చంద్రబాబుకు […]

రూరల్‌లో వైసీపీ ‘రూల్’..మళ్ళీ తిరుగులేదా?

అధికార వైసీపీ ఇప్పుడు ఏపీలో అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఉంది. ప్రస్తుతం సర్వేలు చూస్తే వైసీపీదే ఆధిక్యం కనిపిస్తుంది. అయితే వైసీపీ గత ఎన్నికల్లో అన్నీ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ కాస్త వెనుకబడుతుందని తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో టి‌డి‌పి బలంగా కనబడుతోంది. అర్బన్ , సెమీ అర్బన్ ప్రాంతాల్లో టి‌డి‌పికి బలమైన ఓటింగ్ ఉంది. అయితే రూరల్ లో మాత్రం వైసీపీ పూర్తి ఆధిక్యం కనబరుస్తోంది. అందులో […]

కాంగ్రెస్‌లో ‘బీసీ’ ఇష్యూ..సీట్లు లేవా?

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఎంపిక పెద్ద టాస్క్ అయిపోయింది. ఓ వైపు బి‌ఆర్‌ఎస్ సీట్లు ఖరారు చేసుకుని దూసుకెళుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకో సీటుకు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. కొన్ని సీట్లకు పది మందిపైనే పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. అందులో ఆర్ధికంగా, […]

టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..ఆ మీడియా టార్గెట్.!

టీడీపీ-జనసేన పొత్తు ఎంతవరకు వైసీపీని దెబ్బకొడుతుందో తెలియదు గాని..పైకి పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ నేతలు అంటున్నారు..కానీ లోలోపల మాత్రం ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి దాదాపు చాలా సీట్లలో వైసీపీకి లాభం జరిగింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది. అందులో 50 సీట్లు కేవలం ఓట్ల చీలిక వల్లే గెలిచిందని చెప్పవచ్చు. అందుకే ఈ సారి వైసీపీకి ఛాన్స్ […]

లోకేష్ పాదయాత్ర రీస్టార్ట్..బ్రాహ్మణి ఎంట్రీ అక్కడే.!

లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలుకానుంది. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ పునః ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ రాజోలులో పాదయాత్ర చేస్తూ మధ్యలోనే ఆపేశారు. ఇక తన తండ్రి కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది..కానీ బాబు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికీ ఆయన కేసులు వ్యవహారం ముందుకెళుతూనే ఉంది. అయితే న్యాయ పోరాటం కొనసాగిస్తూనే..పార్టీ పరమైన విషయాల్లో కూడా దూకుడు […]

బాబు కేసులో మలుపులు..సీన్ రివర్స్.!

చంద్రబాబు కేసుల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాబుకు అనుకూలంగా ఎలాంటి తీర్పులు రావడం లేదు. దీంతో టి‌డి‌పి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన కోసం టి‌డి‌పి శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న విధంగా మాత్రం పోరాటం ఫలించడం లేదు. అటు కోర్టుల్లో బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అటు సి‌ఐ‌డి కస్టడీలో 2 రోజుల పాటు విచారించి..మళ్ళీ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు. […]

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… సోషల్‌ మీడియాలో వైరల్‌…!

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… అంటూ కన్యాశుల్యంలో నాటకంలో గిరీశం చెప్పిన డైలాగు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిజమే… ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, […]

తెలంగాణలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలో అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. తొలివిడతలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. అటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై.. స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కచ్చితంగా గెలిచే వారికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వనుంది. అటు.. టికెట్లు […]

అసలు ఆ ఇద్దరు ఏమయ్యారు… ఎక్కడున్నారు….?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పరిస్థితులు గరంగరంగా మారాయి. నేతల యాత్రలతో బిజీ బిజీగా ఉన్న తరుణంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… విజయవాడ ఏసీబీ కోర్టులో […]