కబాలి స్టోరీ అంతా అక్కడేనా!

రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా ప్రారంభమైనప్పుడే ఇదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమని దర్శకనిర్మాతలు చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు పా రంజిత్ మరిన్ని వివరాలు వెల్లడించాడు. తమ సినిమాలో హీరో పూర్తి పేరు కబలీశ్వరన్. బ్రిటీష్ పాలన సమయంలో ఆయన కుటుంబం మలేసియాకు వలస వెళ్తుంది. మలేసియాలోనే పెరిగి పెద్దవాడైన కబాలిని అక్కడి భారతీయ కార్మికుల కష్టాలు కదిలిస్తాయి. వారి సంక్షేమం కోసం కబాలి ఏం చేశారన్నదే తమ సినిమా అని రంజిత్ వివరించాడు. ‘కబాలి’ […]

ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్

తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జయతే కూచిపూడి’ […]

నివేదా థామస్ కి ఒకే చెప్పిన NTR

ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీయే డైరక్టర్‌ కూడా. ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్‌కు నటన పరంగా ప్రాధాన్యత ఉందట. దీంతో చిత్రబృందం కథానాయిక కోసం బాగానే కసరత్తు చేసి..నివేదా థామస్‌ దగ్గర ఆగిందట. ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా […]

మామ కాబోతున్న స్టార్ హీరో

తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో విక్రమ్ త్వరలో మామగారు కాబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్రమ్ సన్నిహితులు తెలిపారు. చెన్నైలోని చాలా ఫేమస్ అయిన సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుమారుడు మను రంజిత్ ను అక్షిత పెళ్లాడనుంది. అక్షిత-రంజిత్ ఎంగేజ్ మెంట్ కోసం విక్రమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జూలై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో వీళ్లిద్దరి నిశ్చితార్ధం జరగనుంది. […]

ఎపిలో బి.కాం కంప్యూటర్స్ క్లోజ్!

బికాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుకు మంగళం పాడేయడానికి ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ప్రణాళిక సిద్దం చేసింది. ఉన్నత విద్యావిధానంలో మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇతర కోర్సులపై ప్రభావం ఎలా వున్నా బి.కాం కంప్యూటర్స్ మాత్రం షేపులు మారిపోతున్నాయి. అసలు ఆ కోర్సు పేరే ఇకపై వినబడడం కష్టమేననిపిస్తుంది. కంప్యూటర్ ప్రభంజనంతో అకౌంటెన్సీలో పట్టు సాధించడం కోసం డిగ్రీలో బి.కాం చదివే విద్యార్థులకు కంప్యూటర్ అకౌన్సీమీద పట్టుండాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన కోర్సు […]

టి కాంగ్రెస్ కి భారమవుతున్న ఆ ఇద్దరు!

తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. […]

చంద్రబాబు చైనా నుంచి ఏం తీసుకొస్తారు?

రాజధాని నిర్మాణమంటే ఏ నాయకుడికైనా కత్తి మీద సాము లాంటిది. నాయకుడిలోని నాయకత్వ లక్షణాల్ని సవాళ్ళే బయటపెడతాయి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకోవడం నాయకుల లక్షణం. ఓ రాజధానిని నిర్మించవలసి వస్తుందని తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడూ అనుకుని ఉండడు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర అద్వితీయం. అంతకు ముందు, ఆ తరువాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పనిచేశారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే కొత్త రాష్ట్రానికి రాజధాని […]

ఆ 12 మందితో కేసీర్ కి తలనొప్పే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పేరుకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 18 మంది వున్నారు. ఇందులో నలుగురైదురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. క్యాబినేట్‌లోని 18 మంది మంత్రుల్లో 12 మంది మంత్రుల తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్న వారు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు […]

చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్‌ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న […]