అశోక్ బాబుకు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అండ‌గా నిలిచిన వారిలో ఉద్యోగ ఐకాస ప్ర‌ధాన‌మైన‌ది! ఎన్‌జీవోల సంఘం అధ్య‌క్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగులు.. టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అంతేగాక ఉద్యోగ సంఘాల‌న్నింటినీ ఐక్యం చేయ‌డంలో అశోక్‌బాబు కృషి ఎన‌లేనిది. అయితే ఇప్పుడు ఆయ‌న‌పై ఉద్యోగులు అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతున్నారు! ముఖ్యంగా అశోక్‌బాబును టార్గెట్ చేస్తూ.. స‌రికొత్త సంఘానికి తెర తీశారు! ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. అంతేగాక కొత్త‌గా ఏర్పాటైన జేఏసీనే అస‌లైన జేఏసీ […]

పవన్ తో పొత్తుకు వైసీపీ తహతహ!

ఏపీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్ ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వన్‌తో పొత్తుకు త‌హ‌త‌హ లాడుతున్నారా? ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే అప్పుడు ప‌వ‌న్ ప‌క్కన చేరేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నారా?  సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోరాడేందుకు జ‌గ‌న్‌.. జ‌న‌సేనానితో క‌లిసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ చూపిస్తున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ముఖ్యంగా వైకాపా ఎంపీ, జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు విజ‌య‌సాయి రెడ్డి నుంచే ఈ విధ‌మైన సిగ్న‌ళ్లు రావ‌డం ఇప్పుడు రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించింది. ఇటీవ‌ల […]

శశికళ సీఎం ఆశలకు సుప్రీం షాక్

త‌మిళ రాజ‌కీయాల‌ను త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ఎన్నో క‌లలు కంటున్న దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళకు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చింది. అసంతృప్తులంద‌రినీ న‌యానో భ‌యానో త‌న వైపు లాక్కుని త‌మిళ‌ సీఎం పీఠంపై శ‌శిక‌ళ‌ కూర్చోబోతున్న వేళ‌.. ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. జ‌య అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన కేసు తుది తీర్పును మ‌రో వారంలోగా వెలువ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో తమిళ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి! అత్యున్న‌త ధ‌ర్మాసనం ఇచ్చే తీర్పుపైనే శ‌శిక‌ళ‌ […]

ఆ జిల్లాలో నలుగురు టీడీపీ సిట్టింగ్లకు టిక్కెట్లు కట్

గుంటూరు జిల్లాలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి! ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతం కావడంతో అటు అధికార‌, విప‌క్ష పార్టీలు ఈ జిల్లాపై పూర్తిగా దృష్టిసారించాయి. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఎవ‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు? ఎవ‌రికి టిక్కెట్టు ఇస్తారు అనే చ‌ర్చ అప్పుడే మొద‌లైంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే ఎవ‌రికి టిక్కెట్ ఇవ్వాల‌నే అంశంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం! పార్టీకి చెడ్డ‌పేరు తీసుకొస్తూ నిత్యం వివాదాల‌తో సావాసం చేస్తూ. . ప్ర‌జ‌ల్లో […]

ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటికి శత్రువు రెడీ

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు గుండె కాయ వంటి ఏలూరులో టీడీపీకి ఎదురు లేదు. ఇక్క‌డి ఎంపీ మాగంటి బాబుకు ఎక్క‌డా లేని ప్ర‌జాద‌రణ సొంతం. అయితే, ఇది నిన్న‌టి వ‌ర‌కు వినిపించిన మాట‌. కానీ, ఇప్పుడు ఈక్వేష‌న్స్ మారిపోయాయి. మాగంటి చెంబూ చేటా స‌ర్దు కోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే టాక్ వినిపిస్తోంది! అదేంటి? ఎందుకు? అని అనుకుంటున్నారా?  విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్ గీసిన స్కెచ్ మ‌హిమ అలా ఉంద‌ట‌! మాగంటికే కాకుండా ప‌శ్చిమ‌లో టీడీపీకి మంచి ప‌ట్టున్న […]

హీటెక్కిన హిందూపురం టీడీపీ పాలిటిక్స్

టీడీపీ కంచుకోట హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది! ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు, సినీ హీరో బాల‌య్య ఇమేజ్ వీధుల పాలైపోతోంది. ముఖ్యంగా ఆయ‌న త‌న నియోజ‌క వ‌ర్గానికి చుట్టపు చూపుకే ప‌రిమితం కావ‌డం, ఉన్న టైం మొత్తం సినిమా షూటింగుల‌తో గ‌డిపేస్తున్నాడు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న బాధ్య‌త‌లు నెర‌వేర్చేందుకు త‌న అనుచ‌రుడు శేఖ‌ర్‌కి బాధ్య‌త‌లు అప్ప‌గించాడు బాల‌య్య‌. అయితే, ఇదే అవ‌కాశంగా భావించిన శేఖ‌ర్ త‌న‌దైన శైలిలో […]

బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?

శివ‌రాత్రి చేసుకునేందుకు క‌నీసంలో క‌నీసం మ‌రో 20 రోజుల స‌మ‌యం ఉంది. అయితే, ఇది సాధార‌ణ జ‌నాల‌కి. కానీ, ఏపీ మంత్రుల‌కి మాత్రం శివ‌రాత్రి జాగారం అప్పుడే వ‌చ్చేసింద‌ట‌!! అది కూడా నిత్యం త‌మ మ‌ధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిన‌బాబే మంత్రుల‌కు శివ‌రాత్రి తీసుకొచ్చార‌ట‌! విన‌డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒక‌రిద్ద‌రు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావు, రావెల కిషోర్ బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావుల‌కు నిద్ర‌మాత్ర‌లేసుకున్నా.. […]

వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!

వైఎస్ కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న క‌డ‌ప‌లో టీడీపీ సైకిల్ ప‌రుగులు పెట్టించాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు అండ్ కో క‌ల‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఈ జిల్లా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం శ‌త‌థా శ్ర‌మిస్తున్నప్ప‌టికీ.. బాబు ప‌క్షాన నిల‌బ‌డే వాళ్లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదనే ప‌రిస్థితి తాజా ప‌రిణామాల‌తో స్ప‌ష్ట‌మైంది! జ‌గ‌న్ ఇలాకాగా పేరు ప‌డ్డ క‌డ‌ప‌లో వైకాపా అడ్ర‌స్ లేకుండా చేద్దామ‌ని చంద్ర‌బాబు య‌త్నిస్తున్నారు. ఆయ‌న‌కు తోడుగా ఆయ‌న అనుచ‌రులు క‌డ‌ప టీడీపీ నేత‌లు […]

ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్ చూపించారా?  త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే.. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. తెర‌వెనుక చేయాల్సింది చేస‌స్తాన‌ని బాబు చేసి చూపించారా? ఎంత‌టి వారైనా త‌న‌కు లోబ‌డే ఉండాల‌నే సిగ్న‌ళ్ల‌ను చంద్ర‌బాబు పంపించారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే! త‌న మంత్రి వ‌ర్గంలో కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి.. రెండు నెల‌ల […]