నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు, జగన్ ఇద్దరు తమ టీంను అంతా ఇక్కడ మోహరించారు. టీడీపీ నుంచి ఆరుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేలను బాబు ఇక్కడ మోహరిస్తే జగన్ ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి రంగంలోకి దించారు. ఇక ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందే నంద్యాలలో మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే […]
Category: Latest News
టీడీపీలో మళ్లీ పాత రోజులు.. నేతలకు బాబు దూరం!
టీడీపీలో కథ మళ్లీ మొదటికి వస్తోందా? చంద్రబాబు నేతలకు దూరం అవుతున్నారా? కేడర్‌ను అస్సలు పట్టించుకోవడం లేదా? 1990ల నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఏపీలో 23 జిల్లాలకు సీఎంగా ఉన్న సమయంలోనూ ఇప్పుడు కేవలం 13 జిల్లాలకు సీఎం గా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు అప్పట్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండడం గమనార్హం. అయితే, ఇక్కడ విషయంలోకి వచ్చేసరికి ఆయన అప్పట్లో […]
నంద్యాల వార్ భూమా, శిల్పాది కాదు బాబు-జగన్ మధ్యే
భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఈ ఉప ఎన్నికపై అంచనాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాస్తవానికి ఈ ఉప ఎన్నిక పార్టీ ల మధ్య కాకుండా పార్టీ అధినేత ల మధ్య ఫైట్‌గా మారిపోయింది. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతగా బాబుకు, యువనేతగా జగన్‌కు మధ్య సాగుతున్న పోరుగా నంద్యాల […]
సిట్ విచారణలో మాస్ మహరాజ్ ఏం చెప్పాడంటే
టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోన్న డ్రగ్స్ ఉదంతంలో తొమ్మిదో రోజు టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. శుక్రవారం రవితేజ జూబ్లిహిల్స్‌లోని తన ఇంటి నుంచి నాంపల్లిలోని అబ్కారీ భవనానికి చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు రవితేజ విచారణ ప్రారంభమైంది. కెల్విన్ మొబైల్ కాల్ డేటాలో రవితేజ ఫోన్ నంబర్ ఉండటం.. విచారణలో కెల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజకు కెల్విన్‌కు […]
బీజేపీలోకి చిరు.. ఏపీలో పొలిటికల్ తుఫాన్?
మెగాస్టార్ చిరంజీవి పార్టీ మారబోతున్నారా? ఆయనను బీజేపీ దువ్వుతోందా? ఏపీలో 2019లో జరగబోయే ఎన్నికల బాధ్యతను సైతం ఆయనకు అప్పగించాలని హైకమాండ్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయా? రాబోయే కొద్ది రోజుల్లోనే చిరు కాషాయ దళంలో చేరడం ఖాయమా? అంటే ఔననే సమాధానమే వస్తోంది బీజేపీ నేతల నుంచి! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చిన చిరు.. తర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసి.. ఏకంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. […]
ఏపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా లోకేష్..!
చంద్రబాబు ప్రభుత్వంలో కాసింత లేటుగా అరంగేట్రం చేసినప్పటికీ.. ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రేంజ్ మాత్రం ప్రస్తుతం పీక్ స్టేజ్‌కి చేరిపోయిందట! ప్రస్తుతం ఆయన ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. అయినా కూడా ప్రజలు అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను లోకేష్‌కే విన్నవిస్తున్నారట. అంతేకాదు, సచివాలయానికి వెళ్తున్న ప్రజలు పనున్నా లేకపోయినా.. లోకేష్‌ను చూడందే బయటకు రావడం లేదట. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ సెంటరాఫ్‌ది మేటర్‌గా మారిపోయాడని అంటున్నారు […]
పవన్ కి మరీ ఇంత దారుణంగానా…!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాజకీయం ఎలా ఉంటుందో ? ఈ లోగా ఎలా రంగులు మారుతుందో ? ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పవన్ పోటీ చేస్తానని చెప్పినా ఆ పోటీ ఒంటరిగా ఉంటుందా ? లేదా ? ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ ఎన్నికల బరిలోకి దిగుతాడా ? అన్నది మాత్రం క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో […]
రవితేజ సిట్ విచారణ ప్రకంపనలు
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ సిట్ విచారణ ప్రకంపనలు రేపుతోంది. రవితేజకు కొందరు డ్రగ్స్ సరఫరా చేశారన్న ఆధారాలు సిట్ వద్ద ఉండడంతో రవితేజ వీటికి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటాడన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా ఉంది. సిట్ నోటీసులు జారీ చేసిన 12 మందిలో 9వ వ్యక్తిగా రవితేజను సిట్ విచారిస్తోంది. రవితేజకు జీశ్యామ్తో ఎక్కువగా లింకులు ఉన్నాయని, అతడి ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకోవడంతో పాటు నేరుగానే డబ్బులు చెల్లించేవాడని తెలుస్తోంది. ఈ విషయాలన్ని జీ […]
మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?
జిల్లా కేంద్రమైన కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహన్‌రెడ్డి ఫస్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహన్‌రెడ్డి దివంగత భూమా దంపతుల్లో శోభకు స్వయానా సోదరుడు కాగా, నాగిరెడ్డికి బావమరిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహన్‌రెడ్డి ఇప్పటకీ రాజకీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించకపోవడం ఓ మైనస్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మారడం మరో మైనస్. ఇక అధికార పార్టీలోకి వచ్చినా […]
