యాంకర్ గా వచ్చి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మా’ టీవీలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఆమె ‘లాస్య’ గా ఓ నెగిటివ్ రోల్ చేస్తూ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తాజగా ప్రశాంతి ఓ బుల్లితెర హీరోను పెళ్లి చేసుకుంది. ఏకంగా దండలు మార్చుకుంది. ఇదంతా ఎపుడు.. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? ఇది నిజం పెళ్లి కాదులేండి. అది ఈటీవీలో వచ్చే క్యాష్ షోలో […]
Category: Latest News
ఎన్జీటీలో జగన్ సర్కార్‌కు ఝులక్!
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో జగన్ సర్కార్‌కు ఝలక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని ఏపి ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను ఎన్జీటీ త్రోసి పుచ్చింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాయలసీమ ఎత్తిపోతల […]
‘నారప్ప’ని పోలీసులు ఏంటి ఇలా వాడుకున్నారు..?
జనాల ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా ఇంకా పోలేదు..అందరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని విభిన్న పద్దతిలో చెప్తున్నారు. ఇవన్నీ నార్మల్ గా చెప్తే జనం వినరని అందుకోసం ట్రెండ్ ఫాలో అవుతూ హీరో హీరోయిన్ ల డైలాగ్ లు వాడుతున్నారు. కరోనాపై అవగాహన కల్పించడం కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్‌ని వాడేసుకున్నారు పోలీసులు. aloge నారప్ప సినిమా పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి […]
కుక్క కోసం కాంస్య విగ్రహం.. ఎక్కడంటే..?
ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఓ వస్తువు పోతేనే మనసు విలవిల్లాడుతోంది. అలాంటిది తొమ్మిదేళ్ల పాటు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ కుక్క చనిపోతే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమను ఓ రైతు విభిన్నంగా చూపించాడు. శునకానికి ఏకంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. వివరాల్లోకి వెళితే. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంకర జ్ఞాపకరావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా […]
వీర్యం తీసిన కొద్ది సమయానికే దారుణం..?
కరోనా కారణంగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకు ఎక్కింది. తనకు తన భర్త వల్లే పిల్లల్ని కనాలని ఉందని అందుకోసం భర్త వీర్యం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కోరిక ప్రకారం ఆమె భర్త వీర్యాన్ని భద్రపరచాలని హైకోర్టు హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించింది. అయితే వీర్యం తీసిన కొద్దిగంటల్లోనే కరోనాతో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి […]
బ్రేకింగ్ : ఆగష్టు 16 నుండి పాఠశాలలు పున:ప్రారంభం..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాఠశాలలు పున:ప్రారంభ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 16 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను పున: ప్రారంభించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆగష్టు 16 ననే మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులను కూడా మొదలు పెట్టాలని అధికారులకు తెలియ చేశారు. ఈ క్రమంలో నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరించడమే కాకుండా.. […]
మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?
దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్ […]
ఓటిటి వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య….?!
కరోనా కారణంగా థియేటర్ లు మూతపడడంతో దానికి ప్రత్యామ్నయంగా హీరోలు ఓటిటి బాట పట్టారు. ఇక థియేటర్ లు ఓపెన్ చేసే దాక చూడడం కన్నా ఓటిటి ఫ్లాట్ఫారం వైపు అడుగులు వేయడం బెటర్ అనుకుంటున్నారు. తాజాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య కూడా ఈ వైపు అడుగులు వేస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమాతో మాయ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు వరుస సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా […]
హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుదలకు డేట్ లాక్?
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]









