తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు […]

అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ […]

కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) […]

వర్లగారూ.. మీ మేడం లెటర్లో ఫైర్ ఉందా?

రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నాయకుడు వర్ల రామయ్య.. తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడమే లక్ష్యం అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో ఆయన ముందే వెనుకా చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వెలివేస్తున్నది.. ఆయన వచ్చినా సరే.. ఇక పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేంత స్థాయిలో విమర్శలు చేశారు. ఇంతకూ వర్లకు అంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే.. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు […]

వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!

జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేయడానికి వర్ల రామయ్య ఎవడు? ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వినవస్తున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లనుంచి వినవస్తున్న ప్రశ్న. వర్ల రామయ్య మాటలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య తన వదరుబోతుతనం వలన పార్టీకి చేటు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కన్నీళ్ల ఎపిసోడ్ దాదాపుగా మరుగున పడిపోతున్న సమయంలో.. దానిని మళ్లీ తెరపైకి తెస్తూ వర్ల రామయ్య రాజకీయం చేయడం […]

మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే […]

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]

వామ్మో.. ఈ హీరో ఒకే హీరోయిన్ తో 130 సినిమాలు చేశాడు తెలుసా?

సినిమా పరిశ్రమలో చాలా హిట్ ఫెయిర్స్ ఉంటాయి. ఈ జంట సినిమా చేసిందంటే విజయం ఖాయం అనే సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆయన జంటలతోనే సినిమాలు మళ్లీ మళ్లీ చేసేందుకు ప్రయత్నిస్తారు ఫిల్మ్ మేకర్. అయితే ఎంత బాగా హిట్ అయినా.. ఓ ఐదారు సార్ల కంటే ఎక్కువ సార్లు ఆయా హీరో, హీరోయిన్లు కలిసి నటించరు. ఊరికే వీరేనా అనే బోర్ జనాల్లో రాకుండా చూసుకుంటారు. అయితే జనాల ఆదరణ కోల్పోకుండా.. ఒక హీరో […]

ఆ స్వతంత్రులకు సపోర్ట్ ఇస్తున్నదెవరో?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అధికార పార్టీకి ఏ ఇబ్బందీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తలనొప్పిగా మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నది 12 స్థానాలు. 12 సీట్లకు గాను 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బరిలోకి దిగారు. అసలు విషయమేమంటే.. 12 సీట్లకు గాను 102 మంది నామినేషన్లు ఫైల్ చేయడంతో […]