వామ్మో.. ఈ హీరో ఒకే హీరోయిన్ తో 130 సినిమాలు చేశాడు తెలుసా?

సినిమా పరిశ్రమలో చాలా హిట్ ఫెయిర్స్ ఉంటాయి. ఈ జంట సినిమా చేసిందంటే విజయం ఖాయం అనే సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆయన జంటలతోనే సినిమాలు మళ్లీ మళ్లీ చేసేందుకు ప్రయత్నిస్తారు ఫిల్మ్ మేకర్. అయితే ఎంత బాగా హిట్ అయినా.. ఓ ఐదారు సార్ల కంటే ఎక్కువ సార్లు ఆయా హీరో, హీరోయిన్లు కలిసి నటించరు. ఊరికే వీరేనా అనే బోర్ జనాల్లో రాకుండా చూసుకుంటారు. అయితే జనాల ఆదరణ కోల్పోకుండా.. ఒక హీరో ఓ హీరోయిన్ తో 130 సినిమాల్లో నటించడమంటే మామూలు విషయం కాదు. అంతేకాదు… ఒకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా కూడా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. ఇంతకీ ఆయ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఈ అరుదైన ఫీట్ సాధించింది ఏ హాలీవుడ్ హీరోనో? బాలీవుడ్ హీరోనో? కాదు. మలయాళ స్టార్ హీరో నజీర్. 1980-90 దశకంలో ఈ హీరోకు మామూలు క్రేజ్ ఉండేది కాదు. సుమారు 520 సినిమాల్లో కలిసి నటించాడు ఆయన. ఈ సినిమాల్లో 130 సినిమాల్లో ఒకే హీరోయిన్ తో యాక్ట్ చేశాడు. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్ షీలా. అంతేకాదు.. 80 మంది హీరోయిన్స్ తో సినిమాలను రిపీట్ చేశాడు. అంతేకాదు.. ఒకే హీరోయిన్ తో జనాలకు బోర్ కొట్టడకుండా 130 సినిమాలు చేసిన హీరోగా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ లోకి ఎక్కాడు.

నిజానికి వీరు సినిమాలు చేస్తే.. చాలా నాచురల్ గా ఉండేది. సహజంగా భార్య భర్తలు ఎలా ఉంటారో.. తెర మీద అలాగే ఉండేవారు. అందుకే వారు ఎన్ని సినిమాలు చేసినా జనాల ఆదరణ రోజు రోజుకు పెరిగింది. అంతేకాదు.. మలయాళ జనాలు వారు నిజ జీవితంలో భార్య భర్తలు అన్నట్లే చూసేవారు. అందుకు వీరిద్దరు కలిసి 130 సినిమాలు చేశారు. అన్ని సినిమాలు చేసినా.. అన్నింటా వైవిధ్యం కనబర్చారు అని చెప్పుకోవచ్చు