ఇన్వెస్టిగేషన్ మొద‌లెట్టిన రాజ‌`శేఖ‌ర్‌`..గ్లింప్స్ అదిరిందిగా!

November 25, 2021 at 7:37 pm

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ తాజా చిత్రం `శేఖ‌ర్‌`. `ది మ్యాన్‌ విత్‌ ది స్కార్‌` అనేది ఉపశీర్షిక. ఆయన సతీమణి, ఒక‌ప్ప‌టి స్టార్‌ హీరోయిన్ జీవిత రాజశేఖర్ స్వ‌యంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర‌న్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. `అరుకు బంగ్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య.. సంఘటనా స్థలానికి హుఠాహుఠిన‌ చేరుకున్న ఎస్పీ ప్రాథమిక విచారణ చేపట్టారు.` అంటూ ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకుట్టుకుంది.

ఈ కేసుని ఛేదించడానికి రిజైన్ చేసి వెళ్లిపోయిన పోలీసాఫీసర్ శేఖర్(రాజ‌శేఖ‌ర్‌) ని రంగంలోకి దించినట్లు ఫస్ట్ గ్లిమ్స్ లో చూపించారు. ఇక తెల్లటి గెడ్డంతో వ‌య‌సు మీద ప‌డిన వ్య‌క్తిగా క‌నిపిస్తున్న‌ రాజ‌శేఖ‌ర్ త‌న‌దైన శైలిలో ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్ట‌డం.. బ్యాక్‌గ్రాండ్‌లో `వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?` అంటూ డైలాగ్ రావ‌డం ఆక‌ట్టుకుంటోంది.

విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి సైతం బాగున్నాయి. మొత్తానికి అదిరిపోయిన శేఖ‌ర్ ఫ‌స్ట్ గ్లింప్స్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆల‌స్య‌మెందుకు మీరూ శేఖ‌ర్ గ్లింప్స్‌పై ఓ లుక్కేసేయండి.

 

ఇన్వెస్టిగేషన్ మొద‌లెట్టిన రాజ‌`శేఖ‌ర్‌`..గ్లింప్స్ అదిరిందిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts