సైడ్ అవుతున్న తమ్ముళ్ళు..టీడీపీకి డ్యామేజ్.!

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనలు తెలియజేసే విషయంలో గాని, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో గాని తెలుగు తమ్ముళ్ళు బలంగా ఉన్నారా? అంటే ఏ మాత్రం లేరనే చెప్పాలి. ఏదో బాబు అరెస్ట్ అయిన రోజు కాస్త హడావిడి చేశారు. తర్వాత రోజు బంద్ అన్నారు గాని..పూర్తి స్థాయిలో తమ్ముళ్ళు బయటకురాలేదు. ఏదో అక్కడకక్కడ కార్యకర్తలు మాత్రం పోరాడుతున్నారు. అసలు టి‌డి‌పి అధికారంలో ఉండగా హడావిడి చేసిన నేతలు..ఇప్పుడు బాబు కోసం అండగా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు. […]

కమలంపైనే అనుమానాలు..టీడీపీ ప్లాన్ రివర్స్.!

చంద్రబాబుని కక్షపూరితంగా…ఎలాంటి ఆధారాలు లేకుండా..కేవలం అధికార బలంతో జగన్ అరెస్ట్ చేయించారని తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం కక్షతోనే బాబుని జగన్ అరెస్ట్ చేయించారని ఫిక్స్ అయ్యారు. అందుకే వైసీపీపై తమ్ముళ్ళు పోరాటం చేస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో బాబుని అరెస్ట్ చేయించింది జగన్ అయితే..దీని వెనుక ఉన్నది బి‌జే‌పి పెద్దలు అని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. అనుమానించడం ఏముంది..డైరక్ట్ గా కామెంట్లు […]

పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..తేడా కొడుతుందా?

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా క్లారిటీ ఉన్నట్లు కనబడటం లేదు. ఆయన బి‌జే‌పితో పొత్తులో ఉన్నారు..అదే సమయంలో ఎక్కువ టి‌డి‌పికి మద్ధతుగా నిలబడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అయితే అరెస్ట్‌కు తెలుగు తమ్ముళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంతకంటే ఎక్కువగా పవన్ సైతం నిరసన తెలిపారు. బాబుకు మద్ధతు ఇచ్చారు. కానీ పవన్ పొత్తులో ఉన్న బి‌జే‌పి మాత్రం..బాబు అరెస్ట్ పై […]

కేవీపీ-కిరణ్‌లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!

తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టి‌డి‌పి పొత్తు పెట్టుకుంది. దీన్ని కే‌సి‌ఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]

ప్రకాశం ‘ఫ్యాన్’ వార్..సాయిరెడ్డి ముందే రచ్చ.!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీలో అంతర్గత పోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ముందు నుంచి అక్కడ కీలక నేతలైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ విభేదాలు నేపథ్యంలోనే బాలినేని..ఈస్ట్ రాయలసీమ కో ఆర్డినేటర్ పదవిని సైతం వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ బాధ్యతలని విజయసాయి రెడ్డి తన భుజాన వేసుకున్నారు. దీంతో మొదట ప్రకాశం జిల్లాలోనే రచ్చకు బ్రేకులు వేసేందుకు సమావేశాలు పెడుతున్నారు. అయినా సరే […]

బాబుకు సపోర్ట్..మోసం లేదట?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మద్ధతు బాగానే వస్తుంది. కానీ ఆయన పొత్తు కోసం ఎదురుచూసిన బి‌జే‌పి నుంచి కాకుండా..ఇండియా కూటమి నేతల నుంచి మద్ధతు ఎక్కువ వస్తుంది. ఇప్పటికే బాబు అరెస్ట్‌ని మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ ఖండించిన విషయం తెలిసిందే. ఇదంతా బి‌జే‌పి, వారి మిత్రులు చేస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు. అంటే బి‌జే‌పితో వైసీపీ రహస్య మిత్రులుగా ఉన్నారనే వాదన తీసుకొస్తున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు […]

టార్గెట్ లోకేష్-పవన్..జగన్ హుకుం?

ప్రతిపక్షాలని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారా? రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రధాన ప్రత్యర్ధి టి‌డి‌పిని దెబ్బతీయాలని చూస్తున్నారా? చంద్రబాబు అరెస్ట్ విధానం చూస్తే అవుననే చెప్పవచ్చని టి‌డి‌పి అనుకూల వర్గాలు అంటున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షపూరితంగానే జగన్..బాబుని అరెస్ట్ చేయించారని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే ఆ కేసులో ఇంకా నిజనిజాలు ఏంటి అనేది పూర్తిగా బయటకు రాలేదు. కానీ బాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ […]

కారుకు జమిలి టెన్షన్..ఏం జరగనుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? షెడ్యూల్ ప్రకారం చూస్తే నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదట వారంలో గాని జరగాలి. కానీ ఇప్పుడు పరిస్తితులు చూస్తుంటే..ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదని బి‌ఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల ఆలోచన చేయడమే. ఇప్పటికే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో ముందుకెళుతూ బిల్లు పెట్టాలని చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు […]

వైసీపీకి సూపర్ ఛాన్స్..వదులుకోకూడదు.!

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్ళడం..వైసీపీకి మంచి అవకాశం అవుతుందా? ఈ ఛాన్స్ సరిగా వాడుకోకపోతే వైసీపీకి మైనస్ అవుతుందా? అంటే అవుననే చెప్పాలి. బాబు జైలుకు వెళ్ళడం ద్వారా టి‌డి‌పి శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. క్షేత్ర స్థాయిలో పోరాటపటిమ తగ్గుతుంది. దీని వల్ల ప్రతిరోజూ వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శలు తగ్గుతాయి. తమ్ముళ్ళ ఫోకస్ మొత్తం బాబు జైల్లో ఉన్నారు..బయటకు ఎప్పుడు వస్తారనే దానిపైనే ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ మరింతగా ప్రజల్లోకి వెళ్ళి వారి […]