కట్ చేస్తే కబాలి అంతకి తేలింది

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలితో కుమ్మేయాలనే చూస్తున్నాడు.రన్ టైమ్ విషయంలో కేర్ తీసుకుంటూనే తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న హిట్ ను ఎలాగోలా ఇవ్వాలని చూస్తున్నాడు.మరి కబాలీ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ ను అందిస్తుందా…?
ఈ సంవత్సరం భారీ సినిమాల్లో ఒకటిగా రాబోతున్న కబాలితో మరోసారి తన స్టామినా చూపించేందుకు అన్నివిధాలుగా సిద్ధమయ్యాడు సూపర్ స్టార్ రజిని.రంజిత్ డైరక్షన్లో భాషా తర్వాత అదే తరహా డాన్ గా నటిస్తున్న కబాలి ఇప్పటికే టీజర్ తో ఎన్నో సంచలనాలను సృష్టించింది.

అయితే ఈ సినిమాకు ఇప్పుడు రన్ టైం లాక్ చేశారని అంటున్నారు.మలేషియా బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా షూట్ దాదాపు సగభాగానికి పైగా అక్కడే షూట్ జరుపుకుంది. ఇక కబాలి నిడివి 152 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.కళైపులి ఎస్ థను నిర్మాతగా నిర్మించిన ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా చేసింది. రజిని లాంటి హీరో తాను చూడలేదు అంటూ రాధికా సూపర్ స్టార్ గురించి చెప్పుకొచ్చింది.

రెండు గంటల ముప్పై రెండు నిమిషాల రన్ టైం తో వస్తున్న ఈ సినిమాలో… ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు, ట్విస్ట్ లు ఉన్నాయట. ఇక ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా… త్వరలో సెన్సార్ స్క్రూట్నీకి వెళ్లనుంది. అయితే జూలై 15న రిలీజ్ అని హడావిడి చేసిన కబాలి టీం. ఇప్పుడు రిలీజ్ కన్ ఫ్యూజన్ లో పడిందని తెలుస్తోంది.మరి అనుకున్న టైంకు సినిమాకు వస్తుందా లేదా అన్నది కూడా ఓ క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సినిమా మీద క్రేజ్ మాత్రం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీగా ఏర్పడింది. ఆ అంచనాలను చేరుకోగలిగే సబ్జెక్ట్, స్క్రీన్ ప్లే ఉంటే మరోసారి భాషా రోజులు గుర్తు చేసినట్టే. రజిని కబాలిగా చేసే హంగామా ఎలా ఉండబోతుందో సినిమా వస్తేనే తెలుస్తుంది.