టాలీవుడ్లో కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు వారసుడిగా వెండితెరంగ్రేటం చేసిన మంచు మనోజ్ షాకింగ్ డెసిషన్ తీసుకుని అందరిని షాక్‌కు గురి చేశారు. టాలీవుడ్ సినీ జనాలు కాని, ఆయన అభిమానులు కాని ఎవ్వరూ ఊహించని విధంగా మనోజ్ ప్రకటన చేశారు. తాను సినిమాల్లో నటించడం మానేస్తున్నానని మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం తాను నటిస్తోన్న ఒక్కడు మిగిలాడు, ఆ తరువాత చేయబోయే మరో చిత్రమే తన చివరి సినిమాలు అని ప్రకటించాడు. మనోజ్ నుంచి వచ్చిన ఈ ప్రకటన టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇక తాను సినిమాల్లో నటించడం మానేసినా సినిమాలతోనే అసోసియేట్ అవుతానని మాత్రం మనోడు హింట్ ఇచ్చాడు.
మనోజ్‌కు సినిమాలంటే చాలా ఫ్యాషన్. సినిమాల్లో యాక్షన్ సీన్ల కోసం చాలా చాలా రిస్క్ చేస్తాడు. అన్న విష్ణు కంటే మనోజే ఎక్కువుగా కష్టపడతాడన్న టాక్ కూడా ఉంది. అయినా మనోజ్‌కు కొద్ది రోజులుగా సరైన హిట్ రావడం లేదు. గతేడాది వచ్చిన శౌర్య, ఎటాక్ రెండూ ఘోరమైన డిజాస్టర్లు అయ్యాయి.
ఇక ఈ యేడాది ఆరంభంలో చేసిన గుంటూరోడు సైతం డిజాస్టరే అయ్యింది. రోజు రోజుకు మనోజ్ మార్కెట్ చాలా డౌన్ అవుతోంది. ఈ క్రమంలోనే మనోడు సినిమాలకు గుడ్ బై చెపుతున్నానంటూ డెసిషన్ తీసుకోవడం విశేషం. మనోజ్ తాజాగా చేసే సినిమాలు హిట్ అయితే తన డెసిషన్ మార్చుకుంటాడేమో చూద్దాం.