టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం క్లాసికల్ కాంబినేషన్ లిస్ట్ తీస్తే కచ్చితంగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబో కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఆడియన్స్ లో ఎవర్ గ్రీన్ సినిమాలు గా నిలిచిపోయాయి. ఈ సినిమాలను ఒకటి కాదు 100 సార్లు చూసిన కాస్త కూడా బోర్ ఫీల్ కలగదు. అయితే.. ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. విజయ్ భాస్కర్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక.. తర్వాత త్రివిక్రమ్ దర్శకుడుగా మారడం, వెంకటేష్ స్టార్ హీరోగా బిజీ అవడంతో.. ఇద్దరి కాంబినేషన్లో తర్వాత ఒక్క సినిమా కూడా రాలేదు.
అయితే.. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్.. వెంకటేష్ తో ఓ సినిమాను ఫిక్స్ చేసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా పనులు వేగం పుంజుకున్నాయి. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నుంచి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ తర్వాత వెంకటేష్ నుంచి రాబోతున్న మూవీ ఇది. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడంతో.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఇక.. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మార్క్ టైటిల్ ఫిక్స్ చేశాడట. ఆయన సినిమాల టైటిల్స్ అన్ని మొదటి నుంచి చాలా కొత్తదనాన్ని ఇస్తూ ఉంటాయి. మొదట్లో ఇదేమి టైటిల్ రా బాబు అనిపించినా.. తర్వాత భలే క్రిస్పీగా సూపర్ టైటిల్ అనే ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు వెంకటేష్‌తో చేయనున్న సినిమాకు కూడా అలాంటి టైటిల్‌నే ఫిక్స్ చేశాడట. త్రివిక్రమ్ అ టైటిల్ మరేదో కాదు.. ” బంధుమిత్రుల అభినందనలతో “.
ఎస్.. ఈ టైటిల్‌తో వెంకటేష్ సినిమా సెట్స్ పైకి రానుందట. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. కచ్చితంగా వచ్చేది. అది దసరా.. లేదా 2027 సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక.. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరవనుంది. ఇప్పటికే దీనిని టీం అఫీషియల్ గా వెల్లడించారు. కాగా.. ఇదే టైటిల్ నిజమే అయితే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం లాంటి మరో హిట్ వెంకటేష్ ఖాతాలో పడినట్టే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పనులు కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ తో ప్రాజెక్టును ప్రారంభించి.. వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తాడని తెలుస్తుంది. డిసెంబర్ 14 నుంచి త్రివిక్రమ్ తో వెంకటేష్ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉందట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే టీం అఫీషియల్ గా ప్రకటించనున్నారు.



