సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి సంక్రాంతి అంటేనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ రేంజ్‌లో పండగ వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది.. ఏ సినిమాకైనా క్యాష్ చేసుకోవడానికి మంచి అదునని నిర్మాతలు, దర్శకులు కూడా.. ఎదురుచూస్తూ ఉంటారు. సంక్రాంతికి వచ్చే సినిమాలంటే ప్రతి ఒక్కరిలో పండగ వాతావరణం మొదలైపోతుంది. ఇందులో భాగంగానే స్టార్ హీరోలు సైతం సంక్రాంతి రేస్‌లో తమ సినిమాలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.

అప్పుడు రిలీజ్ చేస్తే సినిమాలకు భారీ లెవెల్ లో కలెక్షన్లు వస్తాయి.. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారని నమ్మకం. ఈ క్రమంలోనే.. ఇప్పటికే చిరంజీవి – అనిల్ రావిపూడి.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి వచ్చేస్తున్నారు. మరో పక్క.. ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమవుతుంది. రవితేజ – భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి – అనగనగా సినిమా సైతం సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్నాయి.
అయితే.. ఈ సినిమాలతో పాటు.. మరికొన్ని సినిమాలు సంక్రాంతి రేస్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నా.. ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువ ధియేటర్లు దొరికిన.. మిగతా మూవీస్‌కి థియేటర్లు దొరికే అవకాశం కనిపించడం లేదు. దీంతో సంక్రాంతి బరి నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఈ రెండు సినిమాలు తప్పుకునే ఆలోచనలో ఉన్నాయంటూ టాక్ వైరల్ అవుతుంది.

