నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ లు వచ్చాయి. ఇక అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ఇప్పుడు అఖండ తాండవం ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. ఇక.. తాజాగా సినిమాపై హైన్ డబల్ చేస్తూ.. మేకర్స్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారట. అఖండ 2 విషయంలో బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేయాలని ఫిక్స్ అయ్యారట టీం. మూవీ కోసం ప్రీమియర్ అస్త్రా ప్రయోగించనున్నారని.. విడుదలకు ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 4 ఈవ్‌నింగ్ నుంచే చాలా చోట్ల సినిమాకు భారీ ఎత్తున ప్రీమియర్ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా చిన్న సినిమాలు, కంటెంట్ బెస్ట్ సినిమాలకు ఇప్పుడు ఈ ప్రీమియర్ స్ట్రాటజీని వాడుతూ ఉంటారు. కానీ.. బాలయ్య లాంటి మాస్ హీరో సినిమాకు కూడా ముందస్తు షోస్ వేయడం అంటే నిజంగా సాహసమే. ఈ నిర్ణయం వెనక అంతే బలమైన కారణం కూడా ఉందంటూ తెలుస్తుంది. సినిమా కంటెంట్‌పై స్ట్రాంగ్ నమ్మకంతోనే ఈ ప్రీమియర్స్ కు ప్లాన్ చేశారట. సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ సృష్టిస్తే.. మరుసటి రోజు ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కొడతాయని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా ఏదైనా సరే.. ప్రీమియర్ ద్వారా టాక్ పాజిటివ్ గా వస్తే సరే సరి.. ఒకవేళ కాస్త తేడా వచ్చిన అది మెయిన్ రిలీజ్ కలెక్షన్స్ టార్గెట్ పైనే పడిపోతుంది అనడంలో సందేహం లేదు. కానీ.. అలాంటి భయం లేకుండా బాలయ్య అఖండ 2 కోసం రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీన్నిబట్టి అఖండ 2 టీంకు అవుట్ ఫుట్ పై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఇక అన్ని కుదిరి డిసెంబర్ 4న థియేటర్లలో అఖండ 2 తాండవం రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ లో పూనకాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

