నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందు. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక.. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

ఇక బాలకృష్ణ అఖండ 2 తర్వాత.. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య.. గోపీచంద్‌కు మారో ఛాన్స్ ఇచ్చేశాడు. ఇప్పటికే కథ రెడీ చేసిన గోపీచంద్.. సినిమాపై చిన్న చిన్న అప్డేట్స్ ను రివిల్ చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించి.. ఫ్యాన్స్‌కు కిక్కెచ్చే ఓ అప్డేట్ వైరల్ గా మారుతుంది. బాలయ్య మూవీ కోసం.. గోపీచంద్ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట.
![]()
అంతేకాదు.. ఈ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్న బాలయ్యతో కలిసి స్టెప్లు వేయనుందని సమాచారం. ఇప్పటికే కొన్ని స్పెషల్ సాంగ్స్ లో నటించే అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్న తమన్న.. బాలయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఆరాటపడుతున్నారు. చాలాకాలం నుంచి బాలయ్య, తమన్న ఓకే స్క్రీన్ పై కనిపిస్తే బాగుండని ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య, తమన్న కాంబోలో స్పెషల్ సాంగ్ అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నిండింది. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మేకర్స్ ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.

