మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ముహూర్తం ఫిక్స్ ఆ సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. నందమూరి నటవారసుడిగా ఎప్పుడెప్పుడు ఇండ‌స్ట‌ట్రీలో ఎంట్రీ ఇస్తాడు అంటూ బాలయ్య‌ అభిమానులు కాదు.. నందమూరి ఫ్యాన్స్‌తో అంతా కళ్ళు కాయలు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఆయన ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వినిపించినా.. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. ఇక.. ఇదివరకే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాను మేకర్స్‌ అఫీషియల్‌గా కూడా ప్రకటించారు.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అంటూ అనౌన్స్ చేసిన ఆ ప్రాజెక్ట్ సైతం ఏవో కారణాలతో సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయింది. ఈ క్రమంలోనే.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉందా.. లేదా.. మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు.. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే.. ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి తాజాగా ఆయన తండ్రి నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. తను గతంలో నటించిన ఆదిత్య 369 కు కొనసాగింపుగా ఆదిత్య999 మ్యాక్స్ త్వరలోనే సెట్స్‌పైకి రానుందని.. ఇందులో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించాడు.

గోవాలో జరుగుతున్న 56వ ఈఫీ ఇంట‌ర్నేష‌న‌న‌ల్ ఈవెంట్ సెలబ్రేషన్స్‌లో భాగంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని చెప్పుకోవచ్చాడు. ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ త‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని టాక్‌ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో టీమ్ అంతా ఫుల్ బిజీగా గడుపుతున్నారట. ఇక వీలైనంత త్వరగా ఈ స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేసి.. సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఇదేనని సమాచారం.