2027 లో వారణాసి.. రాజమౌళి టార్గెట్ వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న బడా పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి గురించి ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా.. రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి మరి మహేష్ లుక్కు, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ చేశాడు జక్కన్న. ఇక ఈ ఈవెంట్లో సినిమా రిలీజ్ పై కీలక అప్డేట్లు టీం వెల్లడించారు. సినిమా ఆలస్యం కాదని.. 2027లో కచ్చితంగా రిలీజ్ అవుతుంది అంటూ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడ ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగించే ఇంకో విషయం ఏంటంటే.. 2027 ఏప్రిల్ 7 శ్రీరామన‌వ‌మి పండుగ సెలబ్రేషన్స్‌.. స‌మ‌ర్ హాలీడేస్ క‌లిసి రావ‌డంతో..

ఆ టైం కు కచ్చితంగా వార‌ణాసి రిలీజ్ అయిపోయేలా మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాలో.. మహేష్ బాబు రాముడు గా కనిపించబోతున్నాడు అంటూ అఫీషియల్ క్లారిటీ ఇచ్చాడు. ఎప్పటినుంచో మహేష్ అభిమానులంతా రాముడిగా ఆయనను చూడాలని కలగంటున్న నేపథ్యంలో.. ఈ సినిమాలో రాముడిగా మహేష్‌ని చూపించడం.. అది కూడా శ్రీరామనవమి సమయానికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడండు టాక్ వినిపించడంతో.. వారణాసిపై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఈ హైలెట్స్ అన్ని నిజంగా వాస్తవ‌మై.. అన్నీ అనుకున్నట్లు జరిగి నిజంగా ఏప్రిల్ 7, 2027 నాటికి వారణాసి సినిమా రిలీజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో కలెక్షన్లు ఉంటాయి.. పండగ అంచనాలు, రాజమౌళి క్రేజ్ అన్నీ కలిసొచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రికార్డుల సునామీ సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఇప్పటి వరకు జక్కన్న ప్రకటించిన టైం కి.. సినిమా రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైన.. టీం ఈ విషయంలోను క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి సినిమా ఆలస్యం అవ్వదు అని.. చెప్పిన సమయానికి వచ్చేస్తుందంటూ ఈవెంట్లో వెల్లడించారు. ఈ క్ర‌మంలోనే రాజమౌళి మాస్ట‌ర్ ప్లానింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కచ్చితంగా ఈసారి రికార్డులు కొల్లగొట్టడం కాయమంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.