టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ మొదలైనప్పటినుంచి ప్రభాస్ మారే సినిమా షూటింగ్‌కు సమయం కేటాయించడంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ సైతం.. ఆ రకంగా అగ్రిమెంట్‌పై ప్రభాస్ సైన్ చేసిన తర్వాతే.. ప్రాజెక్ట్‌ను లాక్ చేశాడని సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. ఇలాంటి బడా ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. రెండు సినిమాలు స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత సెట్స్‌పైకి వచ్చినా.. ఎంత వేగంగా కంప్లీట్ చేసుకున్న మరో రెండు ఏళ్ల టైం పట్టేస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ అదే ప్లానింగ్ కంటిన్యూ చేస్తాడా.. లేదా కొత్త వ్యూహాన్ని ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.
అయితే.. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. స్పిరిట్ షూట్‌కు సంబంధించి సందీప్ సరికొత్త విధానాన్ని అనుసరించనున్నాడట. మొదట.. ప్రభాస్‌కు సంబంధించిన అన్ని సీన్స్‌ను కంప్లీట్ చేసి.. అతన్ని ప్రాజెక్టు నుంచి బయటకు పంపించేస్తే.. మిగతా పార్ట్ కంప్లీట్ చేయొచ్చని ప్లాన్ సిద్ధం చేశాడట. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. కనుక.. ప్రభాస్ లేని సన్నివేశాలు అంటూ పెద్దగా ఉండవు. చాలా పాత్రలతో ప్రభాస్ కాంబినేషన్స్ ఉంటాయి. వాటితో పాటు.. ప్రభాస్‌పై సోలో సీన్స్ కూడా రావాలి. ఈ క్రమంలోనే.. ప్రభాస్ నటించిన సన్నివేశాలు అన్నీ.. ఓ ఆర్డర్ ప్రకారం ముందుగానే పూర్తిచేసేలా సందీప్ అద్భుతమైన ప్లాన్ రచించాడట. షూటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రభాస్‌తో పాటు.. మొత్తం కంప్లీట్ అయ్యేవరకు మిగతా ఆర్టిస్టుల జోలికి వెళ్లకూడదని ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
ప్రభాస్‌తో కాంబినేషన్ సీన్స్‌లో నటులందరినీ డేట్స్ అందుబాటు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశాడని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక సీన్ల కోసం ప్రభాస్ తన ఆరునెల డేట్స్ మొత్తాన్ని సందీప్ కి ఇచ్చేయాల్సి ఉంది. ప్రభాస్ కూడా తన నెక్స్ట్ సినిమాల లిస్ట్‌ను దృష్టిలో పెట్టుకొని సందీప్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు ఇలాంటి ప్లాను ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు.. షూటింగ్ మొదలైంది అంటే ఎంతో మంది ఆర్టిస్టులను కలుపుకొని కాంబినేషన్స్ చేయాల్సి వస్తుంది. దీంతో.. హీరోకు మధ్యలో బ్రేక్ తప్పదు. ఈ టైం లో వెకేషన్, ఫామిలీ టైం కేటాయించడానికి చూస్తారు. కానీ.. స్పిరిట్ టైంలో ఆరేడు నెలల పాటు ప్రభాస్ అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఒకే ప్రాజెక్ట్ పై రెస్ట్ లెస్ గా పని చేస్తాడని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రబాస్ నటిస్తున్న ఫౌజి సినిమా మార్చ్ కల్లా కంప్లీట్ కానుందట. అటుపై ఏప్రిల్ నుంచి స్పిరిట్ సెట్స్‌పైకి అడుగు పెడతాడట.



