వారణాసిలో ఈ పవర్ ఫుల్ దేవత.. జక్కన ప్లాన్ నెక్స్ట్ లెవెల్..!

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వారణాసి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా టైటిల్ లాంచ్ తో పాటు మహేష్ బాబు లుక్, గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలోనే కాన్సెప్ట్ గురించి హింట్ ఇచ్చేశారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఈ మూవీ తెరకెక్కనుందని.. అందరికీ క్లారిటీ వచ్చేసింది. భూమి ఆవిర్భావం మొదలు త్రేతా యుగం వరకు.. తర్వాత పుల్కా పాతాళ ప్రళయం.. కలి యుగం వరకు దాదాపు అన్ని కాలాలకు వారణాసితో లింక్ చేస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలా వేరువేరు కాలాలన్ని లింక్ చేసే మెయిన్ లైన్ గా మహేష్ ని చూపించారు. అయితే.. ఈ వీడియోలో చిన్న మస్తాదేవి విజువల్స్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రాక్షసి గ‌ణాని వేటాడే ఈ అమ్మవారి రూపం చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.

ఇక ఆమెను ప్రసనం చేసుకున్న వారికి అతీంద్రియ శక్తులు వస్తాయని.. ఎదుటివారు ఎంతటి వాళ్ళైనా చీల్చి చెండాడే శక్తి సొంతమవుతుందని అంటుంటారు. చిన్న మస్తాదేవి దశ మహా విద్యా దేవతలలో ఒకరు. ఈ అమ్మవారు.. తన తలను తనచేతితోనే నరికి పట్టుకున్నట్లు కనిపిస్తుంది. తల నుంచి వచ్చే రక్తం దారలు.. కుడి, ఎడమ పక్కల నుంచి డాకిని, వర్జినిలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ రూపం భయంకరంగా ఉంటుంది. ఈమెనే మహాశక్తి రౌద్రరూపంగా కొలుస్తారు. చిన్న మస్తదేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు.. సృష్టి వినాశనం అనే నైరుద్యాలను తెలుసుకోవచ్చు. ఆమెను కేవలం తంత్ర విద్యను అభ్యసించే వాళ్ళు మాత్రమే ప్రసన్నం చేసుకుంటారు. ఇప్పుడు ఈ దేవతనే లింక్ చేస్తూ.. కథ మొత్తం రూపొందినట్లు తెలుస్తోంది. చిన్న మస్తాదేవి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించి అన్ని తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తూంది.

Varanasi movie title teaser breakdown: Reincarnation and time-travel? SS  Rajamouli plants visual cues and easter eggs in this Mahesh Babu's epic  globetrotting film

ఆమెను ప్రసనం చేసుకునేందుకు.. రుద్ర పాత్రలో మహేష్ అక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రాను చూపించారు. ఇక.. ఈ కథలో పురాణాల ప్రకారం రాక్షస ఘనాన్ని అంతం చేసిన ఆమెకు రక్త దాహం తీరలేదట.. తన వెంట ఉన్న వాళ్లకు కూడా ఆ రక్త దాహం తీరకపోవడంతో స్వయంగా ఆమె సిర చేథ‌నం చేసుకొని రక్తాన్ని ఇస్తుంది. అంతటి ఉగ్రరూపం ఆమెది. ఈ సినిమా ప్రకారం ఉన్న రాక్షస గ‌ణాన్ని ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని రుద్ర ఆమె కటాక్షంతో పొందవచ్చని.. ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతమవుతాయని ఇదే అంశంతో క‌థ రూపొందింద‌ని అంటున్నారు. నిజం ఇదు కథ అయ్యితే మాత్రం.. బొమ్మ అదిరిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.