బిగ్ పైరసీ వెబ్సైట్.. ఐ బొమ్మ విషయంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ వెబ్సైట్ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి అయిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవి.. సైబర్ క్రైమ్ పోలీసులకు కూకట్పల్లి లోని ఓ అపార్ట్మెంట్లో పట్టుపడ్డాడు. శుక్రవారం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కేసు విచారణలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రివిల్ అవుతున్నాయి. ఇమ్మడి రవి, అతని భార్యకి గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయని.. ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తుందని సమాచారం.
ఈ క్రమంలోనే.. విడాకుల కేసు కోసమే.. రవి ఇండియాకు కూడా వచ్చాడట. ఇక కోపంలో ఉన్న భార్య.. భర్త వస్తున్నాడు అనే సమాచారాన్ని తెలుసుకొని పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ను అందించినట్లు సమాచారం. అలా.. భార్యా అందించిన ఇన్ఫర్మేషన్ తో.. రవి హైదరాబాద్ పోలీసులకు పట్టుపడ్డాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో.. అతను ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే.. రవిని ఏడు రోజుల పాటు పోలీసులు కస్టడికి కోరినట్లు సమాచారం.

మరోవైపు.. ఐ బొమ్మ, బెప్పం వెబ్సైట్లను బ్లాక్ చేసిన పోలీసులు.. పైరసీ కంటెంట్, బెట్టింగ్ యాప్లను సైతం ప్రమోట్ చేశాడని తేల్చారు. ఇక.. విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారట కూకట్‌పల్లిలోని అతని ప్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు కొన్ని సినిమాలకు సంబంధించిన హిస్టరీలను సైతం బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న పలు సినిమాల కంటెంట్లను నిలిపివేసినట్టు సమాచారం. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు.


