పదవ వారం ఎలిమినేషన్ క్రేజీ అప్డేట్.. డబుల్ ఎలిమినేషన్ లో వాళ్ళిద్దరు..

బిగ్బాస్ తెలుగు సీజన్ 9 పదోవారం ఎలిమినేషన్స్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది. ఈ వారం నామినేషన్ నుంచి ఇప్పటికే తనుజ సేఫ్ అయిపోయింది. శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిన కెప్టెన్సీ టెస్క్‌లో ఆమె ఇమ్యూనిటీ గెలుచుకొని.. కొత్త క్యాప్టెన్గా మారింది. దీంతో.. ఆమె, ఇమ్ము త‌ప్ప‌ హౌస్‌లో మిగిలిన వాళ్ళు అంత నామినేషన్స్ లో ఉండిపోయారు. నామినేషన్‌లో కళ్యాణ్, డిమాన్‌, సుమన్, భరణి, గౌరవ్‌, నిఖిల్, సంజన, రీతు, దివ్య ఉండగా.. ఎందులో ఎవరు హౌస్ లో ఉంటారు.. ఎవరు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతారని ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది. సోషల్ మీడియాలో వచ్చిన తాజా టాక్ ప్రకారం.. ఈ వారం బాటమ్ 3 లో నిఖిల్ నాయర్, గౌరవ గుప్త, దివ్య మిగిలిపోయారట. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు.

Actor Nikhil Nair: A Beloved Figure in the Entertainment Industry

కానీ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్ బాస్. ఈవారం ఒక‌రు కాదు.. డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిలో ఒకరు నిఖిల్ నాయర్ అంటూ సమాచారం. మరొక ఎలిమినేషన్‌లో గౌరవ గుప్తా ఉన్నారని.. అసలు కైతే దివ్య ఎలిమినేట్ కావాల్సింది. కానీ.. ఆమె హౌస్‌లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉండడం.. ఈ వారం గేమ్ కూడా గట్టిగా ఆడడంతో.. దివ్య ను ఎలిమినేషన్ నుంచి తప్పించి నికిల్‌ ఎలిమినేట్ చేసేలా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కంటెంట్ ఇవ్వడంలో మొదటి నుంచి నిఖిల్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.. ఈ క్రమంలోనే నిఖిల్, గౌరవ్ ఇద్దరూ చాలా లీస్ట్‌లో ఉన్నారు.

Bigg Boss 9 Telugu Voting Today Live | Week 10 | (Online Voting & Results)

టాస్కులపై ఇంపాక్ట్ చూపించలేకపోవడం.. తెలుగులో సరిగా మాట్లాడలేకపోవడం హౌస్ లో సైలెంట్ గా ఉండిపోవడం.. ఎంటర్టైన్ చేయలేకపోవడం.. ఇవన్నీ నిఖిల్, గౌరవ్‌ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా మారాయి. నాగార్జున కూడా.. ఇప్పటికే నిఖిల్‌ వార్నింగ్ ఇచ్చిన ఎలాంటి మార్పు రాకపోవడంతో.. ప్రస్తుతం హౌస్ నుంచి నిఖిల్, గౌరవ్‌ల‌ను ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధార‌ణంగా అయితే ఈవారం ఒక‌రు అవుట్ కావాలి. కానీ.. ఇంకా మరో ఆరువారాల మిగిలి ఉన్నాయి. దానికి తోడు హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఇంకా పదిమంది హౌస్ లోనే ఉంటారు. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ బ్యాలెన్స్ చేసేందుకు ఈసారి డబల్ ఎలిమినేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ ఎలిమినేషన్ అఫీషియల్ గా తెలియాలంటే నేడు వచ్చే వీకెండ్ ఎపిసోడ్ చూడాల్సిందే.