గ్లోబల్ త్రోటర్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకు ధీరుడు రాజమౌళి కాంబోలో ssmb 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేసిన జక్కన్న.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం తెలుగు సినిమా రేంజ్ పాన్ వరల్డ్ కు పాకి పోతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ రివీల్ చేయడానికి జక్కన్న సిద్ధమవుతున్నాడు. గ్లోబల్ ట్రోట‌ర్‌ ఈవెంట్ పేరుతో ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఈవెంట్‌కు ఫ్యాన్స్‌కి పాస్పోర్ట్ విత్.. రూట్ గైడెన్స్‌తో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఏర్పాటు చేసిన విధానం.. ఆ పాస్పోర్ట్ బుక్స్1 సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే.. రాజమౌళి ప్లాన్‌కు కొంత ఫీదా అవుతున్నారు. రాజమౌళితో పాటు.. మహేష్ సైతం గ్లోబల్ త్రోటర్‌ ఈవెంట్‌కు పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. గ్లోబల్ గ్రోట‌ర్ ఈవెంట్ ఈ రేంజ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేయడానికి ప్రధాన కారణం సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రివీల్ చేయకపోవడమే. ఈ భారీ ఈవెంట్‌తో సినిమా రేంజ్ ఏంటి అనేది చెప్పాలని ఆయన ఫిక్స్ అయ్యాడట‌. ఇక కొద్ది గంటల్లో జరగబోయే గ్లోబల్ ఈవెంట్లో మహేష్ బాబు లుక్ తో పాటు.. ఫస్ట్ లుక్, టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం. అయితే.. గ్లోబ‌ల్‌ ఈవెంట్కు కేవలం ఆ సినిమా యూనిట్ మాత్రమే కాదు.. స్పెషల్ గెస్ట్లు కూడా రాబోతున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Sandeep Reddy better than Rajamouli, RGV opines! | RGV Calls Sandeep Reddy  Vanga Better Than Rajamouli

సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ కావాలని ప్లాన్ చేస్తున్న జక్కన్న.. టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది స్టార్ట్ డైరెక్టర్స్ ను ఈవెంట్ కు ఆహ్వానించాడ‌ట‌. ఇందులో భాగంగానే రాజమౌళి గురువు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈవెంట్ కు రానున్నారట. ఆయనతో పాటు ఆర్జీవి, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక.. వీళ్ళతో పాటే హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్స్ కూడా పలువురు రానున్నారని సమాచారం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే.. ఈవినింగ్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే. మొత్తానికి గ్లోబల్ త్రోట‌ర్‌ ఈవెంట్ ఒక్క తెలుగు సినిమా ప్ర‌మోష‌న్ కాదు.. ఇంటర్నేషనల్ మూవీ అని మొదటి హెచ్చరిక జారీ చేయడానికి జక్కన్న సిద్ధమయ్యాడు. ఇక ఇప్పటివరకు ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఫ్యాన్స్‌కు ఫిస్ట్‌లా అనిపించింది. నేడు రిలీజ్ చేయబోతున్న మహేష్ లుక్ తో పాటు గ్లింప్స్‌ కూడా అంతకుమించి పోయే రేంజ్ లో బజ్‌ను క్రియేట్ చేస్తాయని సమాచారం. ఇక ఈ ఈవెంట్ ఎలా ఉన్నా.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో సక్సెస్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు.