అంతా కలలా మిగిలిపోయింది.. ఈరోజు నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా నాన్న.. మహేష్

ఘట్టమనేని సూపర్ స్టార్.. కృష్ణ పేరుకు సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అప్పట్లో ఓకే ఏడాదిలో ఏకంగా 17 నుంచి 18 సినిమాలు చేసిన హీరోగా కృష్ణకు ఘనత ద‌క్కింది. అంతేకాదు.. విజయ నిర్మ‌ల‌తో 48, జయప్రద తో 46 సినిమాలు చేసి.. ఒకే హీరోయిన్ తో హైయ‌స్ట్‌ సినిమాలు చేసిన హీరోగాను కృష్ణ రికార్డులు క్రియేట్ చేశారు. ఇక పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసిన కౌబాయ్ సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణదే. అలాంటి కృష్ణ.. యంగ్ ఏజ్‌లో ఓ ప‌క్క వ‌రుస‌ సినిమాలు చేస్తూనే.. మరో ప‌క్క‌ కుటుంబాన్ని కూడా సక్సెస్ఫుల్‌గా లీడ్ చేశాడు. వయసు మీద పడ్డాక కూడా.. ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలో నటించారు. అయితే.. 2022 నవంబర్ 15న తన తుది శ్వాస విడిచారు కృష్ణ.

విజయనిర్మల మరణించిన తర్వాత ఆయన అనారోగ్యం పూర్తిగా క్షిణించింది. అంతలోనే తన కళ్ళముందే చెట్టు అంత ఎదిగిన కొడుకు రమేష్ బాబు 2022 జనవరిలో మరణించాడు. ఆయన పోయిన బాధ నుంచి కోల్కొనే లోపే కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి సెప్టెంబర్ 2022లో చనిపోయింది. అలా.. ఒకే ఏడాది తన వారైనా ఇద్దరినీ కోల్పోయిన కృష్ణ.. మరింతగా కృంగిపోయాడు. చివరకు అదే ఏడాది నవంబర్ 15న త‌న‌ తుదిశ్వాస విడిచారు. ఇక.. నేటితో ఆయన మరణించి మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలోనే.. తండ్రి మరణాన్ని తలుచుకుని కూతురు మంజుల, కొడుకు మహేష్ ఎమోషనల్ అయ్యారు.

మహేష్ తన ట్విట్టర్ వేదికగా ఈరోజు నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాను నాన్న.. నువ్వు చాలా గర్వంగా ఉంటావని తెలుసు నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. ఇక.. కృష్ణ కూతురు మంజుల తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ.. మీరు చనిపోయి మూడు సంవత్సరాలవుతుంది.. అయినా ఇది నిన్నటి లాగే ఉంది. అంతా కలలా మిగిలిపోయింది అంటూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం.. మహేష్, మంజుల ఇద్దరు తండ్రు మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఈ పోస్టులు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. దీంతో.. ఘట్టమనేని అభిమానుల సైతం ఎమోషనల్ అవుతున్నారు.