గ్లోబల్ ట్రాటర్: మహేష్‌తో రాజ‌మౌళి మూవీ 16 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా.. అసలు మ్యాటర్ ఇదే..!

సాధారణంగా ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఓ దర్శకుడు కొత్తగా అడుగుపెట్టి హిట్ కొట్టాడంటే చాలు.. తన నెక్స్ట్ సినిమా మాకే చేయాలంటూ ఎంతో మంది నిర్మాతలు ఎగబడిపోతూ ఉంటారు. మరి అలాంటిది.. టాప్ మోస్ట్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి లాంటి వాళ్ళకి ఇక ఆఫర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ క్రమంలోనే రాజమౌళితో సినిమా కోసం ఎంతో మంది నిర్మాతలు క్యూ కడుతున్నా.. ఆయన మాత్రం.. కొన్నేళ్ళ క్రితం తాను ఇచ్చిన మూట‌కు క‌ట్టుబ‌డి.. ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు అవ‌కాశం ఇచ్చాడు. ఇక హీరోగా మహేష్‌తో సినిమా చేయాలని కూడా అప్పుడే ఫిక్స్ అయ్యారట. అలా.. రూపొందుతుందే ఈ గ్లోబల్ ట్రోటర్. అసలు ఇంతకీ ఈ కాంబో ఫికస్ అయ్యింది ఎప్పుడు.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో ఇప్పటివరకు నారాయణ నిర్మించిన సినిమాలేంటి.. ఆ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం.

SSMB 29: Mahesh Babu, SS Rajamouli and KL Narayana spotted at Hyderabad  airport

ప్రొడ్యూసర్గ కేఎల్ నారాయణ నిర్మించిన సినిమాలు చాలా తక్కువ. అయినా ఆ సినిమాలు మంచి స‌క్స‌స్ అందుకున్నాయి. క్షణం క్షణం ,హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం.. ఇలా కొన్ని సినిమాలను నిర్మించిన నారాయణ చివరగా ఎన్టీఆర్ రాఖి సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహరించాడు. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఫిక్స్ అయ్యిన‌.. అనివార్య కారణాలతో ఈ సినిమాలు ఆగిపోయాయి. ఆ టైంలోనే.. నారాయణ ప్రొడ్యూసర్‌గా.. రాజమౌళి, మహేష్‌తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. కానీ.. ఇక్కడ అంతకన్నా బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినా.. స్టోరీ మాత్రం కంప్లీట్ కాలేదు.. దానికితోడు రాజమౌళి అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో సినిమా ఆలస్యం అయిపోయింది.

ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత.. రాజమౌళి తండ్రి.. విజేయేంద్ర ప్ర‌సాద్‌.. మహేష్ తో సినిమా స్టోరీ పై కసరత్తులు మొదలుపెట్టాడు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు కాదు దాదాపు 16 ఏళ్ళ క్రితం ఫిక్స్ అయిందట. ఇప్పుడు వీళ్ళిద్దరూ అంత‌కు డ‌బుల్ అయ్యింది. ఈ క్రమంలోనే.. కేఎల్ నారాయణ తాజాగా మాట్లాడుతూ.. ఎప్పుడో రాజమౌళి నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లు మూవీ తీస్తున్నట్లు వాళ్లే ప్రకటించేశారు. వారికి చాలా ధన్యవాదాలు. రాజమౌళికి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా.. వాటన్నింటినీ వదులుకొని నాకోసం సినిమా చేస్తున్నారు అంటూ నారాయణ వివరించాడు. తను మహేష్ తో సినిమా చేయనున్నానని.. దానికి నిర్మాత నారాయణ అని దాదాపు పదేళ్ల‌ క్రితమే రాజమౌళి చెప్పుకొచ్చాడు.

అయితే.. సినిమా ప్రారంభించడం గురించి.. ఇతర నటీనటులు.. సాంకేతిక వివరాలను మాత్రం అఫీషియల్ గా ప్రకటించలేదు. అప్పట్లోనే ఈ సినిమాకు జరగాల్సిన ప్రమోషన్స్ జరిగిపోయాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. స్టోరీ బ్యాక్ డ్రాప్‌పై ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. టైటిల్.. రుద్ర‌, గరుడ, వారణాసి, సంచారి, గ్లోబల్ ట్రోటర్ అంటూ ఇలా ఎన్నో పేర్లు వైరల్ గా మారుతున్నాయి. అయితే జక్కన్న మాత్రం ప్రజెంట్ గ్లోబల్ ట్రోటర్ ర‌నింగ్ టైటిల్‌తో సినిమాను ట్రైండ్‌ చేస్తూ వస్తున్నాడు. గ్లోబల్ ట్రోటర్ అంటే అర్థం ప్రపంచాన్ని చుట్టేసే వ్యక్తి అని. మరి ఇది ఏ జోనర్ కథ‌.. టైటిల్ ఏంటి.. టీజర్ రిలీజ్ చేస్తారా.. లేదా ట్రైలర్ తోనే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేస్తారా.. తెలియాలంటే రాజమౌళి ప్లాన్ చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌ ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇది మరి కొద్ది గంటల్లో రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ లెవెల్ లో మొదలవనుంది.