ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మకు ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఎప్పటికప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమాలను రిలీజ్ రోజునే తమ సైట్లో అప్లోడ్ చేసే ఐ బొమ్మ.. సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం ఉదయం కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అతీన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని.. ఇన్ఫర్మేషన్ తో పక్క ప్లాన్ వేసి మరి అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇన్నాళ్లుగా కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడ నుంచే తన పైరసీ సైట్ లో కొనసాగిస్తున్న ఇమ్మడి రవి.. ఎన్నో కొత్త సినిమాలను రిలీజ్ రోజునే పైరసీ చేసి తన వెబ్సైట్ల ద్వారా వదిలాడు.

కాగా.. పైరసీ అంశంలో ఐ బొమ్మ, మూవీరూల్స్ సైట్లు గత కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్, ఆహా లాంటి ప్రముఖ ఓటీటీ సంస్థలకు షాకిస్తూన్నాయి. వాళ్ల కంటెంట్.. అలాగే థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను పైరసీ చేస్తూ భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పలువురు టాలీవుడ్ సినీ నిర్మాతలు సైతం దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో వెతికే పనిలో బిజీ అయ్యారు.

ఇక గతంలో ఇమ్మడి రవి.. హైదరాబాద్ పోలీసులను దమ్ముంటే పట్టుకోవాలంటూ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎట్టకేలకు.. పోలీసులు ఆ ఛాలెంజ్ బ్రేక్ చేస్తూ రవిని ఊసలు లెక్కపెట్టేలా చేశారు. భార్యతో విడిపోయిన ఇమ్మడి రవి.. సోలో లైఫ్ ను లీడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రవి అకౌంట్ లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసి.. అతని దగ్గర ఉన్న సర్వర్లలో పైరసీ కంటెంట్‌ను కూడా.. తమ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇక ఐ బొమ్మ సీన్ అయిపోయిందని.. ఇకపై పైరసీ సినిమాలు వెబ్సైట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

