టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. నవంబర్ 15న (నేడు) రామోజీ ఫిలింసిటీలో జరగబోయే ఈవెంట్ కోసం కనీవినీ ఎరుగని రేంజ్‌లో మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్‌లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే.. ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమ్ చేయనుండడం విశేషం. కాగా.. ఇప్పుడు రాజమౌళి తన ప్లాన్ దేశ సరిహద్దులను దాటించి హాలీవుడ్ రేంజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. కేవలం ఇండియన్ అభిమానులకే కాదు.. గ్లోబల్ ఆడియన్స్‌కు కూడా.. ప్రమోషన్స్‌తో సినిమాను హైప్ చేసే టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే గ్లోబల్ రేంజ్‌లో సినిమాకు ఏర్పడిన హూప్ దృష్టిలో పెట్టుకొని టైటిల్ రివీల్ ఈవెంట్ ప్లాన్ చేసిన జక్కన.. ఏకంగా ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ వెరైటీ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ ఇచ్చేలా చేశాడట.ఇది ఏదో మొక్కుబడిగా చేస్తున్న పని కాదని.. ఓ పక్కా ప్లానింగ్‌తో ఈవెంట్ స్ట్రీమింగ్.. ప్రత్యేకంగా అమెరికన్ టైమింగ్స్‌తో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ టైం అమెరికన్ టైమింగ్‌లో ఉదయం 8:30కు కావడం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెరైటీ మీడియా హాలీవుడ్‌కే హార్ట్ బీట్ లాంటి సంస్థ. అక్కడ ఒక సినిమా రివ్యూ వస్తే ఎంతో గొప్ప. అలాంటిది.. ఓ ఇండియన్ సినిమా షూటింగ్‌లో ఉండగా.. దాని టైటిల్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ అవడం అంటే.. సాధారణ విషయం కాదు.
బహుశా.. ఇదే మొదటిసారి కూడా. ఈ ఒక్క అడుగుతోనే జక్కన్న తన సినిమా రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పేసాడు. ఇది కేవలం ఓవర్సీస్ లో ఉన్న భారతీయ ప్రేక్షకుల కోసం వేసిన ప్లాన్ మాత్రమే కాదు.. నేరుగా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలు, అంతర్జాతీయ మీడియాలకు వేస్తున్న ఎర్ర అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఓ సినిమా కంప్లీట్ చేసుకుని ట్రైలర్ రిలీజ్ టైం లో ప్రమోషన్స్ లు మొదలుపెడతారు. కానీ.. రాజమౌళి మాత్రం రిలీజ్ కు ఇంకా రెండేళ్ల టైం ఉండగానే టైటిల్ అనౌన్స్మెంట్ కి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను సెట్ చేస్తున్నాడు. గ్లోబల్ ప్లాట్ ఫామ్ పై అంతా సిద్ధం చేస్తున్నాడు అంటే.. ఎస్ఎస్ఎంబి 29ను ఫస్ట్ నుంచి హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీలో ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇక సినిమా కథను కూడా గ్లోబల్ ట్రోటింగ్ అడ్వెంచర్ అని ముందుగానే ప్రకటించిన టీం.. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మార్కెటింగ్ కూడా చేస్తున్నారు.


