ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ పై.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఈ ఈవెంట్ విషయంలో రాజమౌళి సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొద్ది గంటల క్రితం స్వయంగా ఈవెంట్‌కు సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్‌ను వీడియో బైట్‌లో పాస్ చేశాడు జక్కన్న. ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావట్లేదని.. ఫ్యాన్స్ పూర్తిగా నిరాశలో ఉన్న క్రమంలో.. ఊహించని విధంగా ఒకదాని తర్వాత ఒక అప్డేట్ ను రివిల్ చేస్తూ వస్తున్నాడు.

ఇందులో భాగంగానే మొదట పృథ్వీరాజ్ లుక్ రివిల్ చేస్తూ కుంభ పాత్రను ఇంటర్డ్యూస్ చేశాడు. ఇక.. ఈ పోస్టర్ పై ఎన్నో విమర్శలు తలెత్తినా కొంతమంది మాత్రం పవర్ఫుల్ విలన్‌ను జక్కన్న సెట్ చేసాడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక.. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా మెరుస్తుంది. ఈ క్రమంలోనే.. తాజాగా మందాకినీ రోల్ లో ప్రియాంక మెరుస్తున్న లుక్ రివీల్ చేశాడు. ఇక.. రామోజీ ఫిలింసిటీలో జరగనున్న ఈవెంట్‌లో సినిమా టైటిల్‌తో పాటు.. రిలీజ్ డేట్‌ని కూడా అఫీషియల్‌గా వెళ్లడంచనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు కూతురు సితార.. ప్రియాంక చోప్రా కూతురు మాల్తీల మధ్య ఉన్న బాండింగ్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.

మహేష్ కూతురు సితారకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది.. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది. ఈ క్రమంలోనే.. పలు ఈవెంట్స్‌లో మాట్లాడుతూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తండ్రి మహేష్ లానే.. తనకి కూడా సేవ దృక్పథం ఎక్కువ కావడంతో.. ఆమెకు అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుమార్తె మాల్తీ సీతారాలకు మధ్యన ఉన్న బాండ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. మీరు షూట్ కు మాల్తీని తీసుకెళ్తారా అనే ప్రశ్నకు నేను కచ్చితంగా మాల్తిని తీసుకెళ్తాను. హైదరాబాద్ మాల్తికి ఫేవరెట్ స్టాప్ అయిపోయింది అంటూ వివరించింది. అంతేకాదు.. మహేష్ నామ్రతల ముద్దుల కూతురు.. సితారతో మాల్తీ అద్భుతమైన టైం స్పెండ్ చేసింది అంటూ వివరించింది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

