టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను జక్కన్న రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా షూట్‌ను చాలా గోప్యంగా కంటిన్యూ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నవంబర్ 15న ఈ సినిమాపై క్రేజీ అప్డేట్స్ ఇస్తే గ్లోబల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. దీనిపై.. ఎప్పటికప్పుడు హైప్‌ను పెంచుతూ క్రేజీ పోస్టర్లను షేర్ చేసుకుంటున్నాడు జక్కన్న. ఇక.. ఈ ఈవెంట్ కోసం అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మెరవనున్నారు. త్వరలోనే ఈ సినిమా స్కేడ్యుయేల్ రామోజీ ఫిలిం సిటీ వారణాసిలో మొదలవునుంది. అంతేకాదు.. నంబర్ 15న జరగనున్న గ్లోబల్ ఈవెంట్ అయితే రామోజీ ఫిలిం సిటీలోనే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కంటే ముందే సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. గ్లోబల్ ట్రాటర్ అంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్న రాజమౌళి.. దీన్ని టైటిల్ గాను ఫిక్స్ చేశాడట. ఇది సినిమా వర్కింగ్ టైటిల్ గా ప్రస్తుతం కొనసాగుతుంది. గతంలో బాహుబలిని వర్కింగ్ టైటిల్ పెట్టుకొని తర్వాత దాన్ని టైటిల్ గాను అనౌన్స్ చేశాడు జక్కన్న.
ఆర్‌ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ చేయనున్నాడట. ఇప్పటికే గ్లోబల్ ట్రాటర్ అంటూ రన్నింగ్ టైటిల్ గా ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ చేస్తున్న జక్కన్న.. దీనిని మెయిన్ టైటిల్ గా కూడా మార్చేస్తాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ సినిమా హాలీవుడ్ రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనూ.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని.. గ్లోబల్ ట్రాటర్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. నవంబర్ 15న ఈ టైటిల్ అఫీషియల్‌గా ప్రకటించనున్నరట. అంతేకాదు.. 2027 ఏప్రిల్ ఉగాది పండుగకు సినిమా రిలీజ్ చేయనున్నారు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే.. నాలుగు స్కెడ్యూల్‌లను కంప్లీట్ చేసిన టీం.. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ అయిన తర్వాత 2027లో ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లాను సిద్ధం చేశారని సమాచారం. ఇదే వాస్తవం అయితే.. మహేష్ ఫ్యాన్స్ కు పండగే.



