ఇండియన్ స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేంధు శర్మ లాంటి స్టార్ కాస్టింగ్ కీలక పాత్రలో మెరవనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమేతంగా నిర్మిస్తున్న ఈ సినిమాని.. వచ్చే ఏడాది మార్చి 27న..
/rtv/media/media_files/2025/11/07/peddi-movie-song-2025-11-07-11-31-57.jpg)
చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ అనే పేరుతో ఫస్ట్ సింగిల్ ప్రోమో క్లిప్ రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఫుల్ లిరికల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే.. కొద్ది గంటల క్రితం ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు టీం. చిక్కిరి అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది.

విడుదలైన 24 గంటల్లో ఏకంగా 29.19 మిలియన్ వ్యూస్‌ని దక్కించుకోవడమే కాదు.. 676.4 కే లైక్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమాలోని మొదటి సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే సాంగ్ ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకుంది. అదేంటంటే.. ఇప్పటివరకు తెలుగు సినిమాల నుంచి రిలీజై కేవలం 24 గంటల్లోనే హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ గా ఇది మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయిన 24 గంటల్లో హైయస్ట్ లైక్స్ సాధించిన తెలుగు సాంగ్స్ లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది.

