టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులతో పాటు.. ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్.. అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. ఇప్పటికే వచ్చిన అఖండ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం గురించి చెప్తూ హిందువుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసారు మేకర్స్. సినిమా కోసం ఇటీవల జరిగిన మహా కుంభమేళాలోను కొన్ని విజువల్స్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లోనూ ఈ షూట్ ను కంప్లీట్ చేసుకున్న టీం.. ముఖ్యంగా హిమాలయాల్లో సినిమాకు సంబంధించిన షూటింగ్ చేసినట్లు వెల్లడించారు. సాధారణంగా బాలకృష్ణ చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తూ ఉంటాడు. కానీ.. ఈ సినిమా విషయంలో ఆయన చాలా సమయాన్ని తీసుకుంటున్నాడు.

బోయపాటి అడిగిన సమయం ఇచ్చి సినిమాకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు అన్ని విధాల సహకరిస్తున్నారని మేకర్స్ చెప్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు టీం అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమా రిలీజ్ కు మరో నెలరోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. అయినా.. థమన్ నుంచి కాస్త కూడా సౌండ్ వినిపించట్లేదు. ఇప్పటివరకు ఎలాంటి మ్యూజికల్ బ్లాస్టింగ్ అప్డేట్ రాలేదు. దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అలాంటి టైం లో.. ఫస్ట్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చాడు థమన్. ఎట్టకేలకు అఖండ 2 నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని.. అది కూడా పాటను శంకర్ మహదేవ్, కైలాష్ ఖేర్ లాంటి గొప్ప మాస్ డివోషనల్ సింగర్స్ పాడబోతున్నారంటూ థమన్ వెల్లడించాడు.

దీంతో అభిమానులు అంచనాల పెరగడమే కాదు.. ఆనందం కూడా రెట్టింపు అయింది. ఫ్యాన్ అంచనాలకు కాస్త కూడా తగ్గకుండా ఈ సాంగ్ ఉండబోతుందని.. ఈసారి బాక్సులు బద్దలై పోవడం ఖాయం అంటూ.. థమన్ తో పాటు మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అఖండకు మ్యూజిక్ ఏ బిగ్గెస్ట్ స్పెషల్ అట్రాక్షన్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యయి. కాగా ఈ సినిమాకు మరో నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో.. ప్రమోషన్ బాధ్యతలను మొత్తం థమన్ తన భుజాలపై వేసుకున్నాడట. ప్రస్తుతం తన పూర్తి దృష్టి అంతా అఖండ 2 మ్యూజిక్ పైనే పెట్టి.. సినిమా బ్యాలెన్స్ వర్క్ తో పాటు.. బిజిఎం విషయంలను విదేశాల నుంచి టెక్నీషియన్లను రప్పిస్తున్నాడని.. సరికొత్త మిక్సింగ్ టెక్నిక్స్ వాడుతున్నాడని.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ తెలుస్తుంది. ఇక ఫస్ట్ సింగిల్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

