టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కనున్న క్రమంలో మూవీపై నెక్స్ట్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 5న సినిమాలు గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ్ అచ్చంట, గోపీచంద్ అచ్చంట సంయుక్తంగా భారీ బడ్జెట్లో సినిమాను రూపొందిస్తున్నారు.
బాలయ్య చిన్న కూతురు తేజస్విని సినిమాకు సమర్పకరాలుగా వ్యవహరిస్తుంది. ఇక.. సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే భారీ లెవెల్ లో బిజినెస్ జరుపుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్నిటిని కలుపుకొని కోట్లల్లో బిజినెస్ జరిగిందట. అఖండ 2 ఓటిటి హక్కులను.. దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.80 కోట్లకు పైగా వెచ్చించి మరి కొనుగోలు చేసిందంటూ టాక్ వినిపిస్తుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ మొత్తం అనడంలో సందేహం లేదు. ఓ సినిమాకి ఓటీటీ రైట్స్ ఈ రేంజ్‌లో అమ్ముడుపోవడం అంటే సాధారణ విషయం కాదంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. సోషల్ మీడియా నివేదిక ప్రకారం థియేట్రికల్ బిజినెస్ సీడెడ్‌లో రూ.24 కోట్లు, ఆంధ్రాలో రూ.54 కోట్ల మేర జరగగా.. బాలయ్య అడ్డగా నిలిచిన గుంటూరు జిల్లాలో థియేట్రికల్ రైట్స్ మాత్రం.. రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.

రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆఖండ 2.. గుంటూరు థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ.9.5 కోట్లకు దక్కించుకుందట. ఇది నందమూరి బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్ అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా వరల్డ్ వైడ్ గా అఖండ 2 థిమెట్రికల్‌గా రూ.130 కోట్లకు పైగా జరిగనుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయిన లాభాల్లోకి రావాలంటే రూ.140 కోట్ల షేర్, రూ.270 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే సినిమా విషయంలో బోయపాటి కూడా ఎక్కడ తగ్గకుండా నిర్మాణ విలువలు, విజువల్స్ అన్ని విషయాలను దగ్గరండి చూసుకుంటున్నాడట. ఈ క్రమంలోనే సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం భారీ లెవెల్లో రికార్డ్‌లు క్రియేట్ చేస్తుందనటంలో సందేహం లేదు. మరి.. అఖండ 2 ఫైనల్‌గా ఎన్ని కోట్ల బిజినెస్ జరుపుకుంటుందో.. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.


