తారక్ కాదు చరణ్ తో మూవీ ఫిక్స్ చేసిన ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్‌కు తెలుగు ఆడియన్స్‌లోను పరిచయాలు అవసరం లేదు. బీస్ట్, జైలర్ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నెల్సన్.. ఈ సినిమాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేస్తాడంటూ టాక్ తెగ వైరల్ గా మారింది. అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని సమాచారం. ఇక.. అని అనుకున్నట్టు జరిగితే 2026లో ఎన్టీఆర్, నెల్సన్ కాంబోలో సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. కాగా.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్ తో కాకుండా రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నాడు.

Did Jr NTR Indirectly Confirm Doing A Film With Nelson Dilipkumar? Here's  What We Know | Movies News - News18

ప్రస్తుతం ఆయన బ్లాక్ బస్టర్ సినిమా జై లవకుశకు సీక్వల్‌గా జైలర్ 2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ప్రోమో అదిరిపోయే రెస్పాన్స్ ని దక్కించుకుంది. కాగా.. గతంలో తారక్, నెల్సన్ కాంబో మూవీకి సీతారా నాగ‌ వంశీ ప్రొడ్యూసర్గ వ్యవహరిస్తున్నాడంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు.. ఆ ప్లాన్ మొత్తం మార్చేసాడట నెల్సన్. జైలర్ 2 తర్వాత తన నెక్స్ట్ సినిమాను కూడా ఎన్టీఆర్‌తో కాకుండా.. మరో టాలీవుడ్ హీరో తో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెన్నై వర్గాల సమాచారం.

Exclusive : ఎన్టీఆర్ తో కాదు.. రామ్ చరణ్ తో తమిళ డైరెక్టర్ సినిమా ఫిక్స్ –  NTV Telugu

రజనీకాంత్ జైలర్ 2 తర్వాత.. మరో సినిమాను రజనీతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకు దర్శకుడుగా వ్యవహరించనున్నాడని టాక్. ఇటీవల క‌థ‌ చరణ్‌కు వినిపించాడని.. ఆయనకు నచ్చి వెంటనే ఫుల్ స్క్రిప్ట్‌తో రమ్మని నెల్సన్ కు వివరించినట్లు సమాచారం. ఫుల్ నరేషన్‌ కూడా.. కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్‌ను లాక్ చేయబోతున్నారంటూ తమిళ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. నెల్సన్, చరణ్ కాంబోలో తెర‌కెక్కనున్న ఈ సినిమాను.. ప్రముఖ తమిళ్ ప్రొడక్షన్ బ్యానర్ లైకా నిర్మించనుందని తెలుస్తుంది.