టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దుసుకుపోతున్న సంగతి తెలిసి్దే. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్‌లుగా రీద్ది కుమార్ , మాళవిక మోహన్ ,నిధి అగర్వాల్ మెరవనున్నారు. దాదాపు రూ .400 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది.దీంతో సినిమా పై అంచనాలు డబల్ అయ్యాయి. అంతేకాదు.. ప్రభాస్ తన కెరీర్లో మొదటిసారి ఓ హర్రర్, కామెడీ జోనర్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. సినిమా ఇంకా షూట్ కంప్లీట్ కాకముందే భారీ లెవెల్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్, థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లలో భారీ పోటీ నెలకొన్నాయి. ఈ క్రమంలోనే దాదాపు అన్ని భాషల్లోనూ వేరువేరుగా బిజినెస్ డీల్స్ ముగిసాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను మాత్రం హిందీ వర్షన్ కు వేరుగా సౌత్ లాంగ్వేజెస్ కు వేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేశారట.
అలా మూవీ హిందీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లెక్స్ రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి మరి కొనుగోలు చేసిందట. అంతేకాదు.. హిందీ డిజిటల్ రైట్స్ కోసం మంచి పోటీ నెలకొందని సమాచారం. సౌత్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో.. ఆంధ్ర, నైజాంలో తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొందని సమాచారం. అంతేకాదు.. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి అడుగు పెట్టాలంటే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ బిజినెస్ లెక్కలు నెటింట వైరల్‌గా మారడంతో.. కచ్చితంగా ఈ రికార్డును ప్రభాస్ బ్రేక్ చేస్తాడని.. ఈసారి రాజాసాబ్‌తో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ కాయమంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.