ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో స్పిరిట్ మొదటిది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే అంచనాలు ఆకాశానికంటాయి. సందీప్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఎమోషన్, యాక్షన్, మాస్ అన్ని కలగలిపిన అద్భుతమైన కథను ఆడియన్స్‌కు కనెక్ట్ చేస్తాడని నమ్మకం.
ఈ క్రమంలోనే సినిమాకు పాజిటివ్ హైప్ ఏ రేంజ్‌లో అయితే మొదలైందో.. అదే రేంజ్‌లో కాంట్రవర్సీలు కూడా చుట్టుముట్టాయి. మొదటి సినిమాకు దీపక పద్దుకొన్నేను హీరోయిన్గా అనుకున్నారు. అయితే.. కొన్ని అంతర్గత కారణాలతో.. సందీప్ ఆమెను తొలగించడం.. ఈ విషయంలో దీపిక పీఆర్ టీం సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, డీటెయిల్స్, సోషల్ మీడియాలో లింక్ చేశారంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సందీప్ పరోక్షంగా రియాక్ట్ అవుతూ.. స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. అలా.. దీపిక వర్సెస్ సందీప్ వార్ హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతున్న క్రమంలోనే.. స్పిరిట్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో నటించిన ప్రతి సినిమాల్లోనూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం డూప్‌ను వాడాడు. కానీ.. కెరీర్‌లో మొదటిసారి స్పిరిట్ కోసం ఎక్కడ డూప్ వాడకుండా.. ఏ యాక్షన్ సీన్ కూడా అవసరం లేకుండా.. స్వయంగా తానే చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇక.. ప్రభాస్ సినిమాల్లో ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కథలో యాక్షన్ సీన్స్, ఛేజింగ్. గన్ ఫైటింగ్స్ లు చాలానే ఉండనున్నాయని తెలుస్తుంది. దీని కోసమే ప్రభాస్ ఇప్పటికే గన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్‌కు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని సమాచారం. ప్రతి యాక్షన్ షాట్లో తానే స్వయంగా చేసేలా ఇప్పటినుంచే ప్లాన్స్ మొదలు పెట్టాడట.