టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓజి సినిమా ఎలాంటి సంచలన సృష్టించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ పవన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత పవన్ కెరీర్లో ఓజీ తో.. క్లియర్ హిట్ పడింది. ఇక ఇప్పటికే.. సినిమా రెండు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా రెండు వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. లాభాల లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. రిలీజ్ కు ముందు భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. కేవలం ప్రీమియర్ షోస్ నుంచి.. ఆల్ టైం రికార్డ్‌ను నమోదు చేసింది. ప్రీమియర్స్‌తోనే మొదటి రోజు ఏకంగా రూ.154 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.
సింగిల్ లాంగ్వేజ్ నుంచి ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఈ క్రమంలోనే హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. పవన్ స్టామినా ఏంటో.. ఈ జనరేషన్ ఆడియన్స్‌కు చాటి చెప్పింది. ఇదే జోష్ ఎప్పటికీ సినిమా కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే రెండు వారాల్లో ప్రాంతాలవారీగా ఈ సినిమా వసూళ్లు ఒకసారి చూద్దాం. నైజాం ఏరియాలో మూవీ రెండు వారాలకు రూ.50 కోట్ల షేర్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక సీడెడ్ లో సినిమాకు రూ.17 కోట్ల 50 లక్షల షేర్ వచ్చింది. ఈ క్రమంలోనే రెండు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్ లో రూ.4 కోట్ల 50 లక్షల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. ఇక ఉత్తరాంధ్రలో రెండు వారాలకు రూ.16 కోట్ల షేర్ రాబట్టగా.. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ. 4 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇక.. ఈస్ట్ గోదావరి జిల్లా రూ.12 కోట్ల 4 లక్షల షేర్ సొంతం చేసుకుంది. అంటే.. సినిమా ఈస్ట్ గోదావరిలో రూ.4 లక్షల వరకు లాభాలను దక్కించుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెండు వారాలకు రూ.8 కోట్ల 13 లక్షల షేర్ దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ కోసం.. మరో రూ.87 లక్షలు రాబట్టాలి. అలాగే.. గుంటూరులో సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకోవడానికి కోటి 74 లక్షలు రాబట్టాల్సి ఉంది. నెల్లూరులో రూ. 4 కోట్ల 63 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా రూ.130 కోట్లకు పైగా షేర్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా రెండు వారాలకు కలిపి రూ.176 కోట్ల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. చాలా.. చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు దక్కించుకుంటున్నా.. కొన్నిచోట్ల ఇంకా సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉన్న క్రమంలో.. సినిమా పూర్తి లాభాల లెక్కలు తెలియాలంటే.. కొంతకాలం వేచి చూడాల్సిందే.