చరణ్ పెద్ది బిగ్ అప్డేట్.. ఆ మ్యాటర్ లో నా డౌట్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పిరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రుపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫ్రేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలో మెరువనున్నారు. ఇక చరణ్ సినిమాలో కంప్లీట్ ఫుల్ ఆఫ్ మాస్ లుక్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

లాంగ్ హెయిర్.. భారీ గడ్డం, బలమైన శరీరాకృతితో నెవ‌ర్‌ బిఫోర్ లుక్‌తో ఆడియన్స్‌ను చ‌ర‌ణ్ ఆక‌ట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలను నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమాను మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటూ.. ఈ ఏడాది గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. గత కొన్ని రోజులుగా సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని.. పనులు పూర్తి కాలేదంటూ వినిపిస్తున్న వార్తలన్నింటికి క్లారిటీ వచ్చేసింది. సినిమా పోస్ట్ పోన్ అయ్యా అవకాశం లేదట. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు ఎక్కడా ఆగకుండా కంప్లీట్ చేస్తున్న మేకర్స్‌.. ఎట్టి పరిస్థితుల్లోను సినిమాను చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

Ram Charan, Janhvi Kapoor to shoot AR Rahman song for 'Peddi' in Pune -  Telangana Today

అందులో సందేహమే లేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన 60 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. అంతేకాదు.. మేకర్స్‌ సినిమా షూట్ ను చేస్తూనే.. మరోవైపు ఎడిటింగ్ కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో కాస్త కూడా ల్యాగ్‌ లేకుండా చూసుకుంటున్నారట. సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇంట్రెస్టింగ్గా వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ సాంగ్ షూట్‌లో టీం ప‌నుల్లో బిజీగా ఉన్నారట. అందుకు మహారాష్ట్రలోని.. పూణేను స్పాట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే టీం అక్కడకు చేరుకొనున్నారు. అంతేకాదు.. జానీ మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ తో పాటు ఈ సాంగ్లో జాన్వి కపూర్ కూడా మెర‌వ‌నుందట. ఈ సాంగ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉండబోతుందని.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటుందిని సమాచారం.