టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లుఅర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా రూపొందింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ తర్వాత దేశ వ్యాప్తంగా ఆ రేంజ్ హైప్ నెలకొంది ఈ సినిమా పైనే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ సినిమా చేస్తాడని అంతా భావించారు. కానీ.. ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి మరీ.. అట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అల్లు అర్జున్. ఈ సినిమాపై కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. నేషనల్ లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు ఎవ్వరూ కూడా టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాతో ఆడియన్స్ కు చూపించనున్నాడట. తన స్టైల్, మాస్, ఎమోషన్, యాక్షన్ అంశాలను జోడిస్తూ విజువల్స్ స్పెక్టికల్గా ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. అంతేకాదు.. అల్లు అర్జున్ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు వైవిధ్యమైన పాత్రలో మెరవనున్నాడట. ప్రతి లుక్ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. అంతేకాదు.. సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్ చేయనున్నాడట. ప్రతి హీరోయిన్ పాత్ర సినిమాకు కీలకం కానుందని చెప్తున్నారు.
ముఖ్యంగా.. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని.. థియేటర్లు బ్లాస్ట్ అవుతాయంటూ టాక్ నడుస్తుంది. ఇలాంటి క్రమంలో.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఇక సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అల్లు అర్జున్ స్వయంగా అట్లిని రిక్వెస్ట్ చేశారట. దానికి అట్లీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ హాట్ బ్యూటీని ఫిక్స్ చేశాడట. తను మరెవరో కాదు.. నౌరా ఫతేహి. ఇప్పటికే తనదైన గ్లామర్, డ్యాన్స్, ఎనర్జీతో కుర్ర కారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. బన్నీతో కలిసి స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోందని టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. కుర్రాళ్లకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. బన్నీ ఫ్యాన్స్ అరుపులు, కేకలతో ధియేటర్ దద్దరిల్లిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.